తెలంగాణ

telangana

ETV Bharat / sports

పంత్​ మెరుపులతో ముంబయికి ఓటమి - ముంబయి ఇండియన్స్‌

ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య హోరాహోరీగా జరిగిన  మ్యాచ్​లో రోహిత్ సేన పరాజయం పాలైంది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి 176 పరుగులకే ఆలౌటైంది. దీంతో 37 పరుగుల తేడాతో విజయం సాధించింది దిల్లీ క్యాపిటల్స్​.

పంత్

By

Published : Mar 25, 2019, 12:47 AM IST

Updated : Mar 25, 2019, 8:11 AM IST

ఐపీఎల్​-12వ సీజన్​ను ఓటమితో ఆరంభించింది ముంబయి ఇండియన్స్​. దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో 37 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 214 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి ఏ దశలోనూ విజయం దిశగా పయనించలేదు. ఒకానొక దశలో యువీ ఆశలు రేకెత్తించినా.. జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. దిల్లీ బౌలర్లు ఇశాంత్​ శర్మ, రబాడాలు చెరో రెండు వికెట్లు తీశారు.

టాప్​ ఆర్డర్​ విఫలం

ముంబయి టాప్​ ఆర్డర్​ ఘోరంగా విఫలమైంది. రోహిత్​ శర్మ(14) త్వరగా ఔటయ్యాడు. సూర్య కుమార్‌ యాదవ్‌ 2 పరుగులే చేశాడు. 37/2 స్కోరు వద్దక్రీజులోకి అడుగుపెట్టిన యువీ.. తన వంతు పోరాటం చేశాడు. 35 బంతుల్లో 53 పరుగులు చేసి ఆఖర్లో ఔటయ్యాడు. కృనాల్​ 32, పోలార్డ్​ 21 పరుగులతో కొంత మేర ఆకట్టుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్​గా రిషబ్​పంత్ ఎంపికయ్యాడు.

పంత్​ పరుగుల వరద...

పంత్

తొలుత బ్యాటింగ్​ చేసిన దిల్లీ క్యాపిటల్స్‌ 6 వికెట్లకు 213 పరుగులు చేసింది. యువ ఆటగాడు రిషబ్​పంత్‌ ముంబయి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తనదైన శైలిలో రెచ్చిపోయిన ఈ హిట్టర్​ 27 బంతుల్లో (ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్లు) 78 పరుగులు చేశాడు. 18 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేయడం విశేషం. శిఖర్ ధావన్‌ 43, కొలిన్​ ఇన్​గ్రామ్​ 47 పరుగులతో రాణించారు. వీరిద్దరూ 83 పరుగులు జత చేయడంతో ఢిల్లీ గాడిలో పడింది.

బుమ్రా విఫలం...

పంత్​ విజృంభణకు ముంబయి బౌలర్లు ఒక్కొక్కరు 10 రన్​రేట్​తో పరుగులు సమర్పించుకున్నారు. పంత్‌ ధాటికి ఆతిథ్య జట్టులోని బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. బుమ్రా ఓవర్లో కళ్లు చెదిరే సిక్సులతో పంత్​ రెచ్చిపోయాడు. మెక్లెనగన్​మూడు వికెట్లు సాధించగా, బుమ్రా, హార్దిక్‌ , బెన్‌ కట్టింగ్‌లు తలో వికెట్‌ తీశారు.

Last Updated : Mar 25, 2019, 8:11 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details