భారత్-ఆస్ట్రేలియా సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. వన్డేలతో ప్రారంభమై, టెస్టు సిరీస్‌తో ఇది ముగుస్తుంది. నవంబరు 27 నుంచి జనవరి 19 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. డిసెంబరు 17-21 మధ్య అడిలైడ్ వేదికగా డే అండ్ నైట్ టెస్టు జరపనున్నట్లు ప్రకటించారు. ఇటీవలే ఆసీస్‌కు వెళ్లే 32 మంది సభ్యుల జంబో జట్టును టీమ్ఇండియా వెల్లడించింది.
వన్డే సిరీస్(ఉదయం 9:10 గంటలకు ప్రారంభం)
- నవంబరు 27: తొలి వన్డే, సిడ్నీ
- నవంబరు 29: రెండు వన్డే, సిడ్నీ
- డిసెంబరు 2: మూడో వన్డే, కాన్బెర్రా
టీ20 సిరీస్(మధ్యాహ్నం 1:40 గంటలకు ప్రారంభం)
- డిసెంబరు 4: తొలి మ్యాచ్, కాన్బెర్రా
- డిసెంబరు 6: రెండో మ్యాచ్, సిడ్నీ
- డిసెంబరు 8: మూడో మ్యాచ్, సిడ్నీ
టెస్టు సిరీస్(డే/నైట్ మ్యాచ్ ఉదయం 9:30కు, మిగిలినవి ఉదయం 5 గంటలకు ప్రారంభం)
- డిసెంబరు 17-21: తొలి టెస్టు,అడిలైడ్(డే/నైట్ మ్యాచ్)
- డిసెంబరు 26-30: బాక్సింగ్ డే టెస్టు, మెల్బోర్న్
- జనవరి 7-11: మూడో టెస్టు, సిడ్నీ
- జనవరి 15-19: నాలుగో టెస్టు, బ్రిస్బేన్
ఇది చదవండి:కేఎల్ రాహుల్‌కు ప్రమోషన్.. ఆస్ట్రేలియాకు వెళ్లే భారత్ జట్టిదే