ఆస్ట్రేలియాతో చివరి వన్డేలో గెలుపొందడం సహా జట్టులో చేసిన మార్పులు తమకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టాయని టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. సిరీస్ చేజారినా ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించడం పట్ల విరాట్ హర్షం వ్యక్తం చేశాడు.
"మ్యాచ్ ముగిసేంత వరకు కాస్త ఒత్తిడిని ఎదుర్కొన్నాం. శుభమన్ గిల్, ఇతర ఆటగాళ్ల రాకతో జట్టుకు కొత్తదనం వచ్చింది. జట్టులో ఇలాంటి కొత్తదనం అవసరం. బౌలింగ్ వేయడానికి పిచ్ అనుకూలంగా ఉంది. సిడ్నీ గ్రౌండ్స్‌తో పోలిస్తే కాన్బెర్రా మైదానం ఎంతో ఉత్తమం. బౌలింగ్, ఫీల్డింగ్ మెరుగ్గా చేయడం వల్లే ఈ మ్యాచ్‌లో గెలిచాం. పాండ్య, జడేజా బ్యాటింగ్ తీరు హర్షనీయం".
- విరాట్ కోహ్లీ, భారత జట్టు సారథి.
చివరి వన్డేలో గెలిచిన భారత్ 'మేం బాగానే పోరాడాం'
తమ జట్టు ఉత్తమంగానే రాణించిందని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ అభిప్రాయపడ్డాడు.
"మేం బాగానే ఆడామని అనుకుంటున్నా. బౌలింగ్, బ్యాటింగ్‌లో కామెరూన్ గ్రీన్ ఉత్తమంగా రాణించాడు. హార్దిక్, జడేజా భాగస్వామ్యం అద్భుతం. వీరిద్దరిలో ఒక్కరిని పెవిలియన్‌కు చేర్చినా ఈ మ్యాచ్ మేమే గెలిచేవాళ్లం. అగర్ బౌలింగ్ చక్కగా చేశాడు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కూడా బాగా ఆడారు".
-ఆరోన్ ఫించ్, ఆస్ట్రేలియా కెప్టెన్.
ఫించ్ వికెట్ తీసిన ఆనందంలో జడేజా చివరి వన్డే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఛేదనలో ఆసీస్ దీటుగా ఆడినప్పటికీ వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
ఇదీ చదవండి:వరుసగా ఎనిమిదో ఏడాది రోహిత్.. తొలిసారి కోహ్లీ!