బ్రిస్బేన్లో టీమ్ఇండియాతో జరుగుతోన్న నాలుగో టెస్టులో తొలిరోజే సెంచరీ చేయడం గురించి ఆస్ట్రేలియా యువ బ్యాట్స్మన్ మార్నస్ లబుషేన్ మాట్లాడాడు. దానిని భారీ స్కోరుగా మలచడంలో విఫలమైనట్లు పేర్కొన్నాడు. తొలిరోజు ముగిసేసరికి ఆసీస్.. 274/5తో నిలిచింది. క్రీజులో గ్రీన్, కెప్టెన్ పైన్ ఉన్నారు.
"శతకం చేసినా జట్టుకు భారీ స్కోరు అందించడంలో విఫలమైనందుకు బాధగా ఉంది. కానీ, జట్టు పరంగా రోజు పూర్తయ్యేసరి బాగా ఆడాం. 275/5 అనేది చాలా మంచి స్కోరు. గ్రీన్, టిమ్ జట్టును ఆదుకున్న తీరు బాగుంది"