మెల్బోర్న్ వేదికగా టీమ్ఇండియాతో డిసెంబరు 26 నుంచి జరగనున్న బాక్సింగ్ డే టెస్టుకు ఆసీస్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, పేసర్ సీన్ అబాట్ దూరమయ్యారు. వార్నర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని క్రికెట్ ఆస్టేలియా తెలిపింది. అబాట్ గాయం నుంచి కోలుకున్నా.. రెండో టెస్టులో ఆడడని సీఏ స్పష్టం చేసింది. అయితే సిడ్నీలో జరిగే మూడో టెస్టులో వీరిద్దరూ ఆడే అవకాశం ఉందని బోర్డు వెల్లడించింది.
బాక్సింగ్ డే టెస్టుకు వార్నర్ దూరం - భారత్, ఆస్ట్రేలియా సిరీస్
టీమ్ఇండియాతో బాక్సింగ్ డే టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. మెల్బోర్న్ వేదికగా జరగనున్న టెస్టుకు ఓపెనర్ డేవిడ్ వార్నర్, పేసర్ సీన్ అబాట్‌లు అందుబాటులో ఉండరని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.
![బాక్సింగ్ డే టెస్టుకు వార్నర్ దూరం Boxing Day Test: David Warner and Sean Abbott ruled out of 2nd Test vs India](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9975789-8-9975789-1608701495235.jpg)
ఆస్ట్రేలియాకు షాక్.. బాక్సింగ్ డే టెస్టుకు వార్నర్ దూరం
భారత్‌తో రెండో వన్డే సందర్భంగా డేవిడ్ వార్నర్ గాయపడ్డాడు. ఓ క్యాచ్‌ను అందుకునే క్రమంలో అతడి తొడకండరం పట్టేసింది. దీంతో ఆ మ్యాచ్ నుంచి భారత్‌తో చివరి వన్డే సహా టీ20 సిరీస్, అడిలైడ్‌లో తొలి టెస్టుకు వార్నర్ దూరమయ్యాడు.
ఇదీ చూడండి:ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకూ షమీ అనుమానమే!