తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమిండియాకు బీసీసీఐ రూ.5 కోట్ల నజరానా

ఆసిస్​తో ఆఖరి టెస్టులో ఘన విజయం సాధించి.. బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీని వరుసగా మూడోసారి భారత్​ సొంతం చేసుకుంది. ఈ చారిత్రక గెలుపుపై హర్షం వ్యక్తం చేస్తూ... టీమిండియాకు రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది బీసీసీఐ.

BCCI has announced Rs 5 Crores as team bonus
ఐదు కోట్ల నజరానా

By

Published : Jan 19, 2021, 1:56 PM IST

Updated : Jan 19, 2021, 2:45 PM IST

ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్ట్​లో భారత్ ఘన విజయం సాధించింది. దీనితో నాలుగు టెస్టుల సిరీస్​ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 32 ఏళ్ల తర్వాత గబ్బాలో భారత్ తొలిసారి ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించడం విశేషం. ఈ చారిత్రక విజయాన్ని అందించిన టీమిండియాకు బీసీసీఐ రూ.5 కోట్ల నజరానా ప్రకటించింది.

ఈ విజయంపై దేశవ్యాప్తంగా ప్రముఖుల నుంచి టీమిండియా ఆటగాళ్లకు అభినందనలు వెల్లువెత్తున్నాయి.

'భారత క్రికెట్​ చరిత్రలో ఈ విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. బీసీసీఐ రూ.5 కోట్ల బోనస్ ప్రకటించింది. ఈ సంఖ్యకన్నా విజయం ఎంతో విలువైనది.' అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఆసీస్​పై టీమ్​ఇండియా చారిత్రక విజయం

Last Updated : Jan 19, 2021, 2:45 PM IST

ABOUT THE AUTHOR

...view details