ఆస్ట్రేలియా చేతిలో క్లీన్‌స్వీప్ తప్పించుకోవాలన్నా, టీ20 సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో సన్నద్ధమవ్వాలన్నా నేటి వన్డేలో భారత్‌కు విజయం తప్పనిసరి. పసలేని బౌలింగ్, పేలవ ఫీల్డింగ్, నాయకత్వంలో తడబాటుతో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న టీమిండియా కాన్‌బెర్రా వేదికగా బుధవారం ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన కోహ్లీసేన ఈ మ్యాచ్‌లో నెగ్గి పరువు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా, మరోవైపు క్లీన్‌స్వీప్ చేయాలని ఆస్ట్రేలియా ఊవిళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో నామమాత్రపు మ్యాచ్ అయినా రేపటి పోరుపై ఆసక్తి నెలకొంది.
వరుసగా 5 వన్డేల్లో ఓటమి
ఈ ఏడాది న్యూజిలాండ్ పర్యటనలో భారత్ మూడు వన్డేల సిరీస్‌ను 0-3తో కోల్పోయింది. ప్రస్తుత్తం జరగనున్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 0-2తో చేజార్చుకుంది. అయితే వరుసగా రెండు వన్డే సిరీస్‌లు క్లీన్‌స్వీప్ అయిన ఘోరపరాభవాన్ని తప్పించుకోవాలంటే రేపటి మ్యాచ్‌లో కోహ్లీసేన కచ్చితంగా గెలవాలి.
పరువు కాపాడుకోవాలి!
తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఓటమికి పేలవ బౌలింగే కారణం. ఈ నేపథ్యంలో.. మూడో వన్డేలో మార్పులు జరగొచ్చు. ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్న నవదీప్ సైనీ స్థానంలో శార్దుల్ ఠాకూర్ లేదా నటరాజన్‌ను తీసుకునే అవకాశాలున్నాయి.
స్పిన్నర్లు చాహల్, జడేజా కూడా వికెట్లు తీయలేకపోతున్నారు. కోహ్లీ తొందరపాటు బౌలింగ్ మార్పులు కూడా భారత్ ఓటమికి కారణమయ్యాయి. ఇప్పటికే దీనిపై మాజీల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఇంకా టీ-20 సిరీస్‌కు ముందు ఈ మ్యాచ్‌లో గెలుపు భారత్‌కు తప్పనిసరి. విజయం సాధిస్తే.. పొట్టి ఫార్మాట్‌కు ఆత్మవిశ్వాసంతో సన్నద్ధం కావొచ్చు.