ఆసీస్తో రెండో టెస్టులో తమ ఓపెనర్లపై ఎలాంటి ఒత్తిడి పెట్టనని టీమ్ఇండియా తాత్కాలిక కెప్టెన్ రహానె చెప్పాడు. ఈ ఫార్మాట్లో వారి పాత్రే కీలకమని అన్నాడు. తొలి టెస్టులో ఘోర పరాభవం తర్వాత మెల్బోర్న్ వేదికగా రెండో పోరుకు సిద్ధమవుతోంది. శనివారం(డిసెంబరు 26) ఉదయం నుంచే మ్యాచ్ ప్రారంభం కానుంది.
"ఆస్ట్రేలియాతో మ్యాచ్లోనే కాదు. ఎక్కడైనా ఓపెనర్ల పాత్రే చాలా కీలకం. అందుకే నేను వారిపై ఎలాంటి ఒత్తిడి పెట్టాలనుకోవడం లేదు. వాళ్లకు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. దీంతో ఓపెనర్ల తర్వాత బ్యాటింగ్ చేసేవారికి సులభంగా ఉంటుంది. మాకు కోహ్లీ లేని లోటు కచ్చితంగా ఉంటుంది. అతను ఉంటే మ్యాచ్ గొప్పగా ఉండేది"