ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు కెప్టెన్ అజింక్యా రహానే(104) అదరగొట్టాడు. అజేయ శతకంతో చెలరేగి ఆసీస్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. అయితే.. రహానె శతకం చేరడం కంటే ముందే ఐదు సార్లు ఔట్ అయ్యేవాడని అన్నాడు ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్. అదృష్టం ఈసారి జింక్స్ వైపే ఉందని వ్యాఖ్యానించాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం విలేకరుల సమావేశంలో అతడు మాట్లాడాడు.
"రహానె చక్కగా ఆడాడు. అతను శతకం సాధించే కంటే ముందు ఐదు సార్లు ఔటై ఉండేవాడు. కానీ, అదృష్టం అతడి వైపు ఉండడం వల్ల వంద పరుగులు చేయగలిగాడు. ఈ రోజు పూర్తయ్యే సరికి మెల్బోర్న్ క్రికెట్ మైదానం చక్కగా తయారైంది. రెండో ఇన్నింగ్స్‌లో మేం బాగా ఆడగలుగుతాం."
-స్టార్క్, ఆసీస్ పేసర్.