ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో అజింక్య రహానేతో సమన్వయం లోపం వల్ల కోహ్లీ రనౌట్ అయ్యాడు. అయితే ఆ మ్యాచ్ అనంతరం తాను విరాట్ దగ్గరకు వెళ్లి క్షమాపణలు అడిగానని రహానె చెప్పాడు. ఆ సమయంలో అతడు సానుకూలంగా స్పందించాడని తెలిపాడు.
"మ్యాచ్ అయిన తర్వాత కోహ్లీని కలిసి జరిగిన విషయమై క్షమాపణలు కోరాను. దానికి అతడు సానుకూలంగా స్పందించాడు. ఆ పరిస్థితిలో మేమిద్దరం బాగానే ఆడాలని అనుకున్నాం. కానీ ఆటలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. వాటిని గౌరవించి ముందుకు వెళ్లాలి. ఆ రనౌట్ తర్వాత మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగడం గమనించాను"
-- అజింక్య రహానె, టీమ్ఇండియా తాత్కాలిక టెస్టు కెప్టెన్