మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో తొలి రోజు భారత్‌దే ఆధిపత్యం. ఆతిథ్య జట్టును మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 195 పరుగులకే ఆలౌట్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ మొదటి రోజు ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 36 పరుగులు చేసింది. అయితే కంగారూలను కట్టడి చేయడంలో సారథి అజింక్య రహానె ఎత్తులు ఫలించాయి. ఆట ప్రారంభమైన 11వ ఓవర్‌కే అశ్విన్‌తో బౌలింగ్ చేయించడం, తొలి మ్యాచ్ ఆడుతున్న సిరాజ్‌కు ఆలస్యంగా బంతిని అందించడం విజయవంతమైంది. దీంతో మాజీ క్రికెటర్లు జింక్స్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అలాగే సత్తాచాటిన బుమ్రా (4/56), అశ్విన్ (3/35), సిరాజ్ (2/40)ను కొనియాడుతున్నారు.
"బౌలింగ్‌లో మార్పులు, ఫీల్డర్లను మోహరించడంలో రహానె అద్భుతంగా పనిచేశాడు. బౌలర్లు అశ్విన్, బుమ్రా, సిరాజ్ అదరగొట్టారు. తెలివిగా బంతులు వేశారు. తొలి రోజు ఆస్ట్రేలియాను 195 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించడం బ్యాట్స్‌మెన్ చేతుల్లో ఉంది"
-- వీరేంద్ర సెహ్వాగ్
"మొదటి రోజు ఆట మాదే. బౌలర్లు గొప్ప ప్రదర్శన చేశారు. మంచి ముగింపు లభించింది" -- విరాట్ కోహ్లీ