తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​ తర్వాత టీమ్​ఇండియా ఏం చేయనుందంటే? - లేటేస్ట్​ క్రికెట్​ న్యూస్​

India New Zealand Tour: ఈ ఏడాది అక్టోబర్​-నవంబర్​ మధ్య జరగనున్న టీ20 ప్రపంచకప్​ అనంతరం మరో ఆసక్తికర పర్యటనకు సిద్ధమైంది టీమ్​ఇండియా. నవంబర్​లోనే న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది. కివీస్​తో మూడు మ్యాచ్​ల వన్డే, టీ20 సిరీస్​లో బరిలోకి దిగనుంది.

India New Zealand Tour
India New Zealand Tour

By

Published : Jun 28, 2022, 12:07 PM IST

India New Zealand Tour: నవంబర్​లో న్యూజిలాండ్​ పర్యటనకు వెళ్లనుంది టీమ్​ఇండియా. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్​ ముగిసిన తర్వాత.. కివీస్​తో​ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. నవంబర్​ 18 నుంచి 30 వరకు ఈ సిరీస్​ జరగనుంది. ఈ మేరకు న్యూజిలాండ్​ క్రికెట్​ బోర్డు మంగళవారం ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరిలో న్యూజిలాండ్ తిరిగి భారత్​లో పర్యటించనుంది.

మూడు వన్డే మ్యాచులకు ఆంక్లాండ్​, హమిల్టన్​, క్రైస్ట్​చర్చ్​ వేదికలను ఎంపిక చేయగా.. టీ20లు వెల్లింగ్టన్, తౌరంగ, నేపియర్​లో జరగనున్నాయి. భారత్​ ప్రస్తుతం.. ఇంగ్లాండ్​తో రీషెడ్యూల్ చేసిన ఐదో టెస్టు ఆడనుంది. జులై 1-5 మధ్య ఈ మ్యాచ్​ జరగనుంది. ఆ తర్వాత జులై-ఆగస్టులో​ వెస్టిండీస్​తో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది టీమ్​ఇండియా. అనంతరం నేరుగా ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచకప్​కు వెళ్లనుంది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు పొట్టి ప్రపంచకప్​ జరగనుంది.

ఇదీ చదవండి:IND VS ENG: రోహిత్​ స్థానంలో ఆ ప్లేయర్​కు చోటు

ABOUT THE AUTHOR

...view details