IND vs SA: దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ సాధించి చరిత్ర సృష్టించాలనుకున్న భారత్‌కు నిరాశే మిగిలింది. ఆతథ్య సఫారీ జట్టు 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్‌తో విచిత్రమైన రికార్డునూ నమోదు చేసింది టీమ్ ఇండియా.
మొత్తం 20 వికెట్లూ క్యాచ్ అవుట్ అయ్యాయి. ఇందులో ఒక్కటి కూడా బౌల్డ్ లేదా ఎల్బీడబ్ల్యూ, రన్అవుట్ లేవు. దీంతో మొత్తం 20 వికెట్లు క్యాచ్‌ల ద్వారా కోల్పోయిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. ఈ 20 క్యాచ్‌ల్లో ఏడు క్యాచ్‌లను దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ కెయిల్ వెర్రీన్ పట్టాడు.
ఇదే విషయంపై దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ షాన్ పొలాక్ స్పందిస్తూ.." ఇది నేను ఎప్పుడూ వినలేదు. ఇలాంటివి మనం రోజూ చూడలేము. ఒక జట్టు మొత్తం 20 వికెట్లు క్యాచ్‌ల ద్వారానే ఔట్ కావడం ఎన్నిసార్లు జరుగుతుంది.." అని తెలిపాడు.
గతంలో ఒక జట్టులో19 మంది బ్యాట్స్‌మెన్ క్యాచ్‌ల ద్వారా అవుట్ అయిన సందర్భాలు ఉన్నాయి. 1982/83లో తొలిసారి ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో ఇలా జరిగింది. అప్పుడు ఇంగ్లాండ్ క్యాచ్‌ల ద్వారా 19 వికెట్లు కోల్పోయింది. తర్వాత 2009/10లో పాకిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లోనూ పాకిస్థాన్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది.
ఇదీ చూడండి:రహానేపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు