Srilanka vs India: భారత్లో శ్రీలంక పర్యటనకు సంబంధించి మార్పులు చేసినట్లు ప్రకటించింది బీసీసీఐ. లంక మొదటగా మూడు మ్యాచులతో కూడిన టీ20 సిరీస్ ఆడి, ఆ తర్వాత రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుందని తెలిపింది. లంక బోర్డు విజ్ఞప్తి మేరకు ఈ మార్పులు చేసింది భారత క్రికెట్ బోర్డు.
"ఫిబ్రవరి 24 నుంచి టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్కు లక్నో ఆతిథ్యమివ్వనుంది. తర్వాత రెండు మ్యాచులను ధర్మశాలలో జరగనున్నాయి. అనంతరం మార్చి 4-8వరకు మొహలిలో తొలి టెస్టు, మార్చి 12-16వరకు బెంగళూరులో రెండో టెస్టు నిర్వహించనున్నాం"