తెలంగాణ

telangana

ETV Bharat / sports

దక్షిణాఫ్రికా సిరీస్​కు జట్టును ప్రకటించిన బీసీసీఐ- మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు - భారత్ దక్షిణాఫ్రికా పర్యటన

India Squad For South Africa Series : దక్షిణాఫ్రితో జరగబోయే సిరీస్​ కోసం టీమ్​ను ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ బోర్డు- బీసీసీఐ. ఇదే జట్టు

India Squad For South Africa Series
India Squad For South Africa Series

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2023, 8:29 PM IST

Updated : Dec 1, 2023, 6:11 AM IST

India Squad For South Africa Series :టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికాతో జరగబోయే సిరీస్​లో భాగంగా ఆదేశంలో డిసెంబర్ 10 నుంచి పర్యటించనుంది. వన్డే ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత భారత్​ చేపట్టనున్న తొలి విదేశీ పర్యటన ఇదే. ఈ సిరీస్​లో భాగంగా మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులో ఆతిథ్య జట్టుతో తలపడనుంది. రోహిత్ శర్మ టీ20 కెప్టెన్సీ చేపడతాడా? లేదా? అనే ఉత్కంఠకు తెరదించుతూ మూడు ఫార్మట్లకు ముగ్గురు కెప్టెన్లను నియమించింది భారత క్రికెట్ నియంత్రణ బోర్డు- బీసీసీఐ. పరిమిత ఓవర్ల సిరీస్‌లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. టెస్టు సిరీస్‌కు రోహిత్.. వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్‌.. టీ20లకు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీ బాధ్యతలు చేపడతారు.

దక్షిణాఫ్రికా సిరీస్​కు భారత జట్టు :

టీ20 జట్టు :యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ ., రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, మహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.

టెస్టు జట్టు :రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, మొహమ్మద్. షమీ*, జస్ప్రీత్ బుమ్రా ( వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ.

వన్డే జట్టు :రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్)(వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ ., ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్.

భారత్‌-దక్షిణాఫ్రికా సిరీస్‌ షెడ్యూల్ :

  • తొలి టీ2 -డిసెంబర్‌10
  • రెండో టీ20 -డిసెంబర్‌ 12
  • మూడో టీ20 -డిసెంబర్‌ 14
  • తొలి వన్డే -డిసెంబర్‌ 17
  • రెండో వన్డే -డిసెంబర్‌19
  • మూడో వన్డే -డిసెంబర్‌ 21
  • తొలి టెస్టు -డిసెంబర్‌ 26 నుంచి డిసెంబర్‌30 వరకు
  • రెండో టెస్టు - జనవరి 3 నుంచి జనవరి 7 వరకు

రోహిత్​ - టీమ్ఇండియాకు నువ్వు కావాలయ్యా!

దక్షిణాఫ్రికా టీ20 టూర్​కు హార్దిక్​ దూరం- రోహిత్​కు కెప్టెన్సీ ఇచ్చే ఛాన్స్​!

Last Updated : Dec 1, 2023, 6:11 AM IST

ABOUT THE AUTHOR

...view details