India Squad For Australia ODI Series :సెప్టెంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో.. భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ సోమవారం టీమ్ఇండియాజట్టును ప్రకటించింది. అయితే ఇందులో తొలి రెండు మ్యాచ్‌లకు టీమ్ఇండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండడం లేదు. వీరు ముగ్గురు తిరిగి మూడో మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నారు.
తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్జట్టుకు సారధ్యం వహించనున్నాడు. ఇకస్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, బ్యాటర్ సంజూ శాంసన్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ ఇద్దరికి జట్టులో చోటు దక్కలేదు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు మాత్రం.. చాలా రోజుల తర్వాత పిలుపు అందింది. అతడు సుమారు 20 నెలల తర్వాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. అశ్విన్ చివరిసారిగా 2022లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆడాడు. యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ కూడా మూడు మ్యాచ్‌లకు ఎంపికయ్యాడు.
ఆస్ట్రేలియా సిరీస్ షెడ్యూల్..
- సెప్టెంబర్ 22.. తొలి వన్డే (మొహాలి)
- సెప్టెంబర్ 24.. రెండో వన్డే (ఇందౌర్)
- సెప్టెంబర్ 27.. మూడో వన్డే (రాజ్‌కోట్).
తొలి రెండు వన్డేలకు భారత్ జట్టు:కేఎల్ రాహుల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.