Women T20 rankings: మహిళా క్రికెటర్ల తాజా టీ20 ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది ఐసీసీ. బౌలింగ్ విభాగంలో టీమ్ఇండియా లెఫ్ట్ఆర్మ్ స్పిన్నర్ రాధాయాదవ్ ఏకంగా ఏడు స్థానాలు ఎగబాకి పదమూడో స్థానానికి చేరుకుంది. శ్రీలంకపై 2-1తేడాతో టీమ్ఇండియా సిరీస్ గెలవడంలో నాలుగు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించడంతో ఈ ఫీట్‌ను అందుకుంది.
బ్యాటింగ్ విభాగంలో శ్రీలంక కెప్టెన్ చమారి ఆటపట్టు కెరీర్ బెస్ట్ ఏడో ర్యాంకుకు చేరింది. టీమ్ఇండియాతో జరిగిన తాజా సిరీస్‌లోని మూడు మ్యాచుల్లో మొత్తం 139 పరుగులు చేసింది. మూడో టీ20లో 80* రన్స్‌తో అదరగొట్టి ఈ మార్క్‌ను అందుకుంది. ఆల్‌రౌండర్స్ జాబితాలో రెండు ర్యాంకులను మెరుగుపరచుకుని ఏడో స్థానంలో నిలిచింది.