తెలంగాణ

telangana

ETV Bharat / sports

WTC final: టీమ్​ఇండియాకు మాజీ క్రికెటర్​ హెచ్చరిక - టీమ్​ఇండియా న్యూజిలాండ్​ డబ్ల్యూటీసీ ఫైనల్​

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో(WTC Final) న్యూజిలాండ్​ను తక్కువ అంచనా వేయకూడదని టీమ్​ఇండియాకు(Team India) సూచించాడు భారత మాజీ పేసర్​ అజిత్​ అగార్కర్​. అండర్​డాగ్స్​గా బరిలో దిగి గెలిచే సత్తా కివీస్​కు ఉందని తెలిపాడు.

teamindia
టీమ్​ఇండియా

By

Published : Jun 1, 2021, 9:55 AM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​(WTC Final) ముంగిట టీమ్​ఇండియాను హెచ్చరించాడు భారత మాజీ పేసర్​ అజిత్​ అగార్కర్​. ఈ మ్యాచ్​లో న్యూజిలాండ్​ జట్టును తక్కువ అంచనా వేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పరోక్షంగా అన్నాడు.

"ఫైనల్​లో న్యూజిలాండ్​ను తక్కువ అంచనా వేసి టీమ్​ఇండియా(TeamIndia) పశ్చాతాపం పడుతుందని నేను భావించడం లేదు. నాకు తెలిసినంత వరకు కివీస్ అండర్​డాగ్​ ట్యాగ్​ను తొలగించుకుంది. టీ20 ప్రపంచకప్​, ఛాంపియన్స్​ ట్రోఫీ, ప్రపంచకప్.. అన్ని ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టు సత్తా చాటుతోంది. భారత జట్టు న్యూజిలాండ్​లో పర్యటించినప్పుడు వారు మనోళ్లను ఓడించారు. కాబట్టి కోహ్లీసేన జాగ్రత్తగా ఆడి.. కివీస్​ జట్టును ఓడించాలి" అని అగార్కర్​ అన్నాడు.

ఇంగ్లాండ్​ వేదికగా జరగబోయే ఈ ఛాంపియన్​షిప్​ ఫైనల్(జూన్​18-22)​ తర్వాత అక్కడే ఉండి ఇంగ్లీష్​ జట్టుతో టెస్టు సిరీస్​(ఆగస్టు 4-సెప్టెంబరు 14) ఆడనుంది టీమ్​ఇండియా.

ఇదీ చూడండి: WTC final: జిమ్​లో చెమట చిందిస్తూ.. ఫైనల్​కు సిద్ధమవుతూ

ABOUT THE AUTHOR

...view details