న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి టీ20లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (56) అర్ధ శతకంతో రాణించాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్‌తో (29) కలిసి దూకుడుగా ఆడాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది భారత్. దీంతో కివీస్ ముందు 185 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. శ్రేయస్ అయ్యర్ (25), వెంకటేశ్ అయ్యర్ (20) ఫర్వాలేదనిపించారు. ఆఖర్లో హర్షల్ పటేల్ (18), దీపక్ చాహర్ (21) మెరుపులు మెరిపించారు.
కివీస్ బౌలర్లలో సాంట్నర్ 3 వికెట్లు, బౌల్ట్, మిల్నే, సోధీ, ఫెర్గూసన్ తలో వికెట్ తీశాడు.