IND Vs WI Series: ఈ ఏడాది ఆగస్టు నెలలో వెస్టిండీస్‌తో భారత క్రికెట్ జట్టు.. అమెరికాలో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. మూడు వన్డేలు, ఐదు టీ20ల కోసం భారత జట్టు.. విండీస్ పర్యటనకు వెళ్లనుంది. వెస్టిండీస్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడనుండగా, చివరి రెండు టీ20లు యూఎస్‌లో జరుగుతాయి. ఈ రెండు మ్యాచ్‌లను.. ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో నిర్వహించనుంది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. కాగా, ఈ సిరీస్.. జులై చివరి వారంలో ప్రారంభమై ఆగస్టు మొదటి వారంలో ముగియనుందని సమాచారం.
India Matches In US: ఫ్లోరిడాలోని లాడర్‌హిల్ స్టేడియం ఇప్పటికే ఆరు అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యాన్నిచ్చింది. 2016, 2019 సంవత్సరాల్లో టీమ్ఇండియా ఈ స్టేడియంలో నాలుగు మ్యాచ్‌లు ఆడింది. టీమ్ఇండియా పర్యటన షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామని, ఆగస్టు 6, 7 తేదీల్లో రెండు మ్యాచ్‌లు జరిగే అవకాశాలున్నాయని ఓ బీసీసీఐ అధికారి చెప్పారు.