Rohit Sharma Pakistan Match: వన్డేలు ప్రభ కోల్పోతున్నాయనడం అర్థరహితమని భారత కెప్టెన్ రోహిత్‌శర్మ అన్నాడు. "టెస్టు క్రికెట్ ప్రమాదంలో ఉందని ఒకప్పుడు జనాలు అంటుండేవారు. ఇప్పుడు వన్డేల గురించి మాట్లాడుతున్నారు. నా వరకు క్రికెట్ ముఖ్యం. ఫలానా ఫార్మాట్‌కు ఆదరణ తగ్గిందని ఎప్పుడూ చెప్పను. ఏ ఫార్మాట్ ఆడాలనేది వ్యక్తిగతం. నేనైతే టెస్టు, వన్డే, టీ20 మూడింటికీ ప్రాధాన్యత ఇస్తా. నిజానికి వన్డే క్రికెట్ ఎప్పటికీ కనుమరుగు కాదు" అని రోహిత్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ చేతిలో ఓడినా.. ఈసారి భారత్ భిన్నంగా ఉందని రోహిత్ అన్నాడు.
"గతేడాది దుబాయ్‌లో పాకిస్థాన్‌తో ఆడినప్పుడు ఫలితం అనుకూలంగా రాలేదు. కానీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు భారత్ భిన్నంగా ఆడుతోంది. భిన్నంగా సిద్ధమైంది. ఆసియాకప్‌లో ముందుగా పరిస్థితులకు అలవాటుపడాలి. 40 డిగ్రీల పైన వేడిలో ఆడాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రత్యర్థి పాక్ అయినా బంగ్లాదేశ్ అయినా జట్టుగా ఆడడం ముఖ్యం. ఈ కప్‌కు ముందు జట్టుగా కొన్ని విషయాల్లో సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంది" అని రోహిత్ పేర్కొన్నాడు. ఈనెల 27న దుబాయ్‌లో ఆసియాకప్ ప్రారంభం కానుంది. 28న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడుతుంది.