తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​-పాక్​ ద్వైపాక్షిక సిరీస్​.. గంగూలీ ఏమన్నాడంటే? - బీసీసీఐ

భారత్​-పాక్​.. మధ్య జరిగేది మ్యాచ్ మాత్రమే​ కాదు. ఓ ఎమోషన్. ఇరు దేశాల అభిమానులు ఎంతో ఉద్వేగభరితంగా తిలకిస్తారు. గెలిస్తే.. పండగే. ఓడిందా.. టీవీలు పగలాల్సిందే! అలాంటిది.. దాదాపు దశాబ్ద కాలంగా ఐసీసీ టోర్నీల్లో మినహా ద్వైపాక్షిక సిరీసుల్లో (Ind vs Pak Bilateral Series) పాల్గొనడం లేదు. రెండు దేశాల మధ్య మళ్లీ మ్యాచ్​ ఎప్పుడుంటుందా అని ఫ్యాన్స్​ ఎదురుచూస్తున్న వేళ.. దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు (Sourav Ganguly News) గంగూలీ.

ind vs pak
బీసీసీఐ

By

Published : Nov 15, 2021, 7:17 PM IST

భారత్​-పాకిస్థాన్​ మ్యాచ్​కు (India vs Pakistan) ఉండే క్రేజే వేరు. మ్యాచ్​ కోసం ఇరు దేశాల్లోని కోట్లాది క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక మ్యాచ్​ జరిగే జోరు పండగే. గెలుపోటములు ఎంతో ఉద్వేగానికి గురిచేస్తాయి. అలాంటిది 9 ఏళ్లుగా దాయాదీ దేశంతో ద్వైపాక్షిక సిరీస్​ (Ind vs Pak Bilateral Series) జరగలేదు.

చివరిసారి 2012లో భారత్​లో పర్యటించింది పాక్. అయితే ఐసీసీ ఈవెంట్లలో మాత్రం తలపడుతూ వస్తున్నాయి. చివరిసారిగా ఈ రెండు జట్లు.. టీ20 ప్రపంచకప్​లో ఎదురుపడ్డాయి. అది​ టీ20 చరిత్రలోనే అత్యధిక మంది వీక్షించిన మ్యాచ్​గా రికార్డు నెలకొల్పింది!

ఇక ఇరు దేశాల మధ్య మళ్లీ ద్వైపాక్షిక సిరీస్​ (India vs Pakistan Series) కోసం లక్షలాది అభిమానులు ఎదురుచూస్తున్న వేళ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు (Sourav Ganguly News) బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ.

"భారత్​- పాక్(Ind Pak Match) మధ్య ద్వైపాక్షిక క్రికెట్.. పాక్ బోర్టు లేదా బీసీసీఐ చేతిలో లేదు. ఐసీసీ ఈవెంట్లలో ఇరు జట్లు తలపడుతున్నా.. రెండింటి మధ్య అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్​లు కొన్నేళ్లుగా జరగటం లేదు. దీనిపై ఇరు దేశాల ప్రభుత్వాలు స్పందించి నిర్ణయం తీసుకోవాలి. ఇది నా చేతుల్లో గానీ, రమీజ్ చేతుల్లో గానీ లేదు."

-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

పీసీబీదీ అదే మాట..

అంతకుముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ రమీజ్​ రాజా కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్​ నిర్వహించడం సాధ్యపడదని చెప్పాడు.

దాదా తలుచుకుంటే..!

అయితే టీమ్​ఇండియా సారథిగా తనదైన ముద్ర వేసిన గంగూలీ (Ganguly News).. బీసీసీఐ అధ్యక్షుడిగానూ తన మార్క్‌ చూపిస్తున్నాడు. తాను సారథిగా ఉన్నప్పుడు యువ క్రికెటర్లకు పెద్దపీట వేసి భారత జట్టు భవిష్యత్తుకు బాటలు వేసిన దాదా.. ఇప్పుడు టీమ్​ఇండియాను మరోసారి విశ్వ విజేతను చేసే దిశగా ప్రణాళికలు రచిస్తున్నాడు. పదవిపై అంతగా ఆసక్తి లేని.. రాహుల్ ద్రవిడ్​ను టీమ్​ఇండియా ప్రధాన కోచ్​గా, వీవీఎస్​ లక్ష్మణ్​ను జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్​గా కీలక బాధ్యతలు చేపట్టేలా ఒప్పించాడు. రానున్న మూడేళ్లల్లో జరిగే ఐసీసీ టోర్నీలకు పటిష్ఠ జట్టును తయారు చేసే వ్యూహాల్లో ముగినిపోయాడు. ఈ నేపథ్యంలోనే దాదా తలుచుకుంటే భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్​లు (India Pak Bilateral Series) మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

ఇదీ చూడండి:

T20 World Cup: ఇది నయా పాకిస్థాన్‌.. ఇక పూర్వవైభవమేనా?

భారత్ తలుచుకుంటే మేం కుప్పకూలిపోతాం: పీసీబీ ఛైర్మన్

IND vs PAK: 'మళ్లీ క్రికెట్​ మ్యాచ్​లు జరగాలి!'

ABOUT THE AUTHOR

...view details