ప్రపంచకప్ గెలవాలనేది ప్రతి దేశ క్రికెట్ జట్టు కోరిక. అలాంటిది మూడు విభాగాల్లోనూ ఈ కప్‌లను టీమ్ఇండియా గెలుచుకుంది. 60, 50, 20 ఓవర్ల వరల్డ్‌కప్‌ల్లో విజేతగా నిలిచిన ఏకైక టీమ్‌గా రికార్డు సృష్టించింది. అది ఇప్పటికీ మన పేరు మీదే ఉండటం విశేషం.
1983లో కపిల్‌దేవ్ నేతృత్వంలో వన్డే ప్రపంచకప్ ఆడిన భారత్.. డిఫెండింగ్ ఛాంపియన్ వెస్డిండీస్‌ను ఓడించి, విజేతగా నిలిచింది. ఈ టోర్నీ 60 ఓవర్ల విధానంలో సాగడం గమనార్హం.
2007లో ధోనీ కెప్టెన్సీలో తొలి టీ20 ప్రపంచకప్ ఆడిన భారత్.. అంచనాల్ని తలకిందులు చేస్తూ కప్ ఎగరేసుకుపోయింది. ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి, జగజ్జేతగా అవతరించింది.
2011లో స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించిన మెన్ ఇన్ బ్లూ.. అద్భుతంగా ఆడింది. ఫైనల్లో శ్రీలంకను ఓడించి, 28 తర్వాత మళ్లీ ప్రపంచకప్‌ను ముద్దాడింది. దీంతో మూడు విభిన్న ప్రపంచకప్‌లు గెలుచుకున్న ఏకైక జట్టుగా టీమ్ఇండియా నిలిచింది.
ఇది చదవండి:సచిన్ బ్యాట్‌తో పాక్ క్రికెటర్ ఫాస్టెస్ట్ సెంచరీ