ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమ్ఇండియా ఆటగాళ్లు అందరి దృష్టిని ఆకర్షించారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్(Shane Warne on Ind vs Eng) అన్నాడు. కరోనా కారణంగా ఐదో టెస్టును రద్దు చేస్తూ ఈసీబీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన వార్న్.. కోహ్లీసేనపై ప్రశంసలు కురిపించాడు.
"ఈ సిరీస్‌లో టీమ్ఇండియా ప్రదర్శన అద్భుతం. వారు ఆడిన తీరుకు నా టోపీ తీసి సలాం కొడుతున్నా. నిజానికి రెండు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. ఇంగ్లాండ్, టీమ్ఇండియా మధ్య చివరి టెస్టు రద్దుకావడం మంచి విషయమే. ఒకవేళ మ్యాచ్ మధ్యలో ఉండగా ఆటగాళ్లకు కరోనా ఉందని తెలిస్తే.. ఆ ప్రభావం ఐపీఎల్‌పై పడేది."
--షేన్ వార్న్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.