బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ చివరి వరకు పోరాడినా విజయం సాధించలేకపోయింది. అయితేనేం ఆశలు లేని సమయంలో క్రికెట్ అభిమానులను మునివేళ్ల మీద నిలబెట్టేలా చేశాడు. ఇదే మ్యాచ్‌లో మరో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.
నో బాల్స్ అన్నీ ఒకేలా.. బంగ్లా బౌలర్ వరుస ఫ్రీ హిట్లు - bangladesh bowler mehedi no balls
గాయమైనా పట్టించుకోకుండా అద్భుత ప్రదర్శన చేశాడు భారత సారథి రోహిత్ శర్మ. భారత్ ఓడినా.. ఈ అరుదైన సంఘటన ప్రేక్షకుల మదిలో చిరకాలం నిలిచిపోతుంది. ఇదే కాకుండా భారత్- బంగ్లాదేశ్ రెండో వన్డేలో మరో అరుదైన ఘటన జరిగింది. అదేంటంటే..
సెంచరీతో బంగ్లాకు గౌరవప్రదమైన స్కోరు అందించిన మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లోనూ రాణించాడు. అయితే ఇన్నింగ్స్ 21వ ఓవర్‌లో వరుసగా రెండు బంతులను 'నో బాల్'గా వేశాడు. ఇందులో వింతేముంది.. బౌలర్ ఇలా వేయడం సహజమేగా అని అనుకోకండి.. ఎందుకంటే రెండు నోబాల్స్‌ను ఒకేలా వేయడం గమనార్హం. బౌలింగ్ చేసే క్రమంలో మెహిదీ కాలు స్టంప్స్‌కి తాకడంతో అంపైర్ 'నో బాల్'గా ప్రకటించాడు. ఇలా వరుసగా రెండు బంతుల్లోనూ చోటు చేసుకోవడం విశేషం. దీంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'బెస్ట్ నో బాల్ ఆఫ్ ది డే' అంటూ కామెంట్లు కురిశాయి.
అయితే మొదటిసారి వచ్చిన ఫ్రీ హిట్‌ను అక్షర్ పటేల్ సింగిల్ మాత్రమే తీశాడు. ఇక రెండో ఫ్రీ హిట్‌ను శ్రేయస్ (82) బౌండరీ బాదాడు. చివరికి మెహిదీ బౌలింగ్‌లోనే శ్రేయస్ అయ్యర్ పెవిలియన్‌కు చేరాడు.