రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా, రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. జరుగుతున్న తొలి ద్వైపాక్షిక సిరీస్‌ను ఒడిసిపట్టాలని భారత జట్టు వ్యూహాలు రచిస్తోంది. న్యూజిలాండ్‌తో స్వదేశంలో (India vs New Zealand) జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో.. మొదటి మ్యాచ్ గెలిచిన టీమ్ఇండియా.. రెండో మ్యాచ్‌లోనూ జయభేరి మోగించేందుకు కసరత్తు చేస్తోంది.
తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో కొన్ని లోపాలు తలెత్తగా.. వాటిపై జట్టు దృష్టిసారించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (Rohit Sharma News), కేఎల్ రాహుల్ (KL Rahul News) ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించగా, వన్ డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్.. అర్ధ శతకంతో రాణించాడు. రెండో మ్యాచ్‌లోనూ ముగ్గురు జోరు కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
మిడిలార్డర్ మెరుగవ్వాలి..
అయితే మిడిలార్డర్ (India Team Middle Order) బ్యాటర్లు విఫలం కావడం.. జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. నాలుగో స్థానంలో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్‌లో తడబడ్డాడు. తర్వాత వచ్చిన.. రిషభ్ పంత్ పర్వాలేదనిపించినా.. ఆరో స్థానంలో వచ్చిన వెంకటేష్ అయ్యర్ తన అరంగేట్రం మ్యాచ్‌లో.. రెండు బంతుల్లోనే పెవిలియన్ చేరాడు. తుది జట్టులో అవకాశం లభిస్తే శ్రేయాస్, వెంకటేశ్ మెరుగైన ఆటతీరు కనబర్చాలని జట్టు ఆశిస్తోంది.
బౌలింగ్ విభాగంలో సీనియర్లు భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్.. తమ స్థాయికి తగ్గట్టు రాణించి, చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్ మాత్రం.. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మొదటి మ్యాచ్‌లో గాయపడిన సిరాజ్ స్థానంలో.. మరొకరికి అవకాశం ఇవ్వొచ్చని తెలుస్తోంది.