తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్-ఇంగ్లాండ్ టెస్టు​ సిరీస్​కు ప్రేక్షకులు! - ఇండియా ఇంగ్లాండ్ సిరీస్​కు ప్రేక్షకులకు అనుమతి

భారత జట్టు ఆడనున్న క్రికెట్​ మ్యాచ్​ల్లో ప్రేక్షకుల సందడి కూడా కనిపించనుంది. యూకేలో లాక్​డౌన్(Lockdown) ఎత్తివేయడమే ఇందుకు కారణం. ఆగస్టు 4 నుంచి ఈ టెస్టులు జరగనున్నాయి.

india vs england, played in front of capacity crowd
ఇంగ్లాండ్ vs ఇండియా, ప్రేక్షకులకు అనుమతి

By

Published : Jul 6, 2021, 9:32 AM IST

క్రికెట్​ అభిమానులకు శుభవార్త. త్వరలో ప్రారంభం కానున్న టీమ్​ఇండియా-ఇంగ్లాండ్(INDIA VS ENGLAND)​ టెస్టు సిరీస్​కు ప్రేక్షకులను పూర్తి స్థాయిలో అనుమతించనున్నట్లు తెలుస్తోంది. యూకేలో లాక్​డౌన్ నిబంధనల​ను ఎత్తివేస్తూ ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఫ్యాన్స్​ను స్టేడియాలకు అనుమతించడానికి మార్గం సుగమమైంది!

లాక్​డౌన్​ నేపథ్యంలో ఇటీవల సౌథాంప్టన్​ వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్​షిప్​లో(World Test Championship) ప్రేక్షకులను పరిమిత సంఖ్యలో అనుమతించారు. కేవలం 4 వేల మంది మాత్రమే ప్రతిష్ఠాత్మక ఫైనల్​ చూసేందు​కు హాజరయ్యారు. ఈ మ్యాచ్​లో కివీస్​ 8 వికెట్ల తేడాతో గెలిచి, కప్ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం 20 రోజుల విరామంలో ఉన్న టీమ్ఇండియా.. ఇంగ్లాండ్​తో ఐదు టెస్టుల సిరీస్​ కోసం జులై 14న తిరిగి సమావేశం కానున్నారు. ఆగస్టు 4 నుంచి ట్రెంట్​ బ్రిడ్జ్​ వేదికగా తొలి మ్యాచ్​ జరగనుంది.

ఇదీ చదవండి:Sachin&Mithali: ఆ విషయంలో సచిన్-మిథాలీ ఒకటే!

ABOUT THE AUTHOR

...view details