తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20​ల్లో 'ఛేజింగ్' కింగ్.. టీమ్​ఇండియా కొత్త రికార్డు - టీ20ల్లో టీమ్​ఇండియా రికార్డు

టీ20 మ్యాచ్​ల్లో టీమ్​ఇండియా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఛేజింగ్​లో ఎక్కువ మ్యాచ్​లు గెలిచిన జట్టుగా నిలిచిన ఘనత సాధించింది

team india
టీమ్​ఇండియా

By

Published : Nov 18, 2021, 7:16 AM IST

న్యూజిలాండ్​తో టీ20 సిరీస్​లో(IND vs NZ T20 series) భాగంగా తొలి మ్యాచ్​లో విజయం సాధించింది టీమ్​ఇండియా. కివీస్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో టీమ్​ఇండియా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

టీ20ల్లో ఛేజింగ్​లో ఎక్కువసార్లు విజయం సాధించిన జట్టుగా నిలిచింది టీమ్​ఇండియా. బుధవారం(నవంబర్ 17) కివీస్​పై గెలుపుతో 50 విజయాలను సొంతం చేసుకుని మొదటి స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, పాకిస్థాన్​ జట్లు 49 టీ20 విజయాలతో(ఛేజింగ్​) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

తొలి మ్యాచ్​లో పైచేయి..

జైపూర్​ వేదికగా జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్‌పై భారత్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం టీమ్‌ఇండియా నాలుగు వికెట్లను కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (62), కెప్టెన్‌ రోహిత్ శర్మ (48) రాణించారు. తొలి వికెట్‌కు కేఎల్ రాహుల్ (15)తో కలిసి రోహిత్ అర్ధశతక భాగస్వామ్మం నిర్మించాడు.

రాహుల్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్‌తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్‌ను పరుగులు పెట్టించాడు. వీరిద్దరూ కలిసి మరో అర్ధశతకం (59) జోడించారు. రోహిత్ ఔటైనా.. సూర్యకుమార్‌ ధాటిగానే బ్యాటింగ్‌ చేశాడు. ఈ క్రమంలో టీ20 కెరీర్‌లో మూడో హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. అయితే దూకుడుగా ఆడుతున్న సూర్యకుమార్‌ కివీస్‌ బౌలర్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. రిషభ్‌ పంత్ 12*, శ్రేయస్‌ అయ్యర్ 5, వెంకటేశ్‌ అయ్యర్ 4 పరుగులు చేశారు. కివీస్‌ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, సౌథీ, డారిల్ మిచెల్, సాట్నర్‌ తలో వికెట్‌ తీశారు.

ఇదీ చదవండి:

ఎన్​సీఏ ఫాస్ట్ బౌలింగ్​ కోచ్​గా ట్రోయ్​ కూలి

ABOUT THE AUTHOR

...view details