వెస్టిండీస్‌తో తొలి టీ20లో టీమ్ఇండియా అదరగొట్టింది. బంతితో, బ్యాట్‌తో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
కోల్‌కతా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా.. రోహిత్ శర్మ(40), ఇషాన్ కిషన్ (35), సూర్యకుమార్(34), వెంకటేష్ అయ్యర్(24) రాణించడం వల్ల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలోనే ఛేదించింది. విండీస్ బౌలర్లలో ఛేజ్ 2 వికెట్లు తీయగా, అలెన్-కాట్రెల్ తలో వికెట్ పడగొట్టారు.