తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్​ఇండియా బౌలర్ల శ్రమ వృథా.. ఉత్కంఠ పోరులో బంగ్లా విజయం - india bangladesh odi series

బంగ్లాదేశ్​తో జరిగిన తొలి వన్డేలో టీమ్​ఇండియా ఒక వికెట్ తేడాతో ఓటమిపాలైంది. అద్భుత ప్రదర్శన చేసిన భారత బౌలర్లు శ్రమ వృథా అయ్యింది. ఇక అద్భుతంగా ఆడిన.. బంగ్లా టెయిల్​ ఎండర్లు.. జట్టును విజయ తీరాలకు నడిపించారు.

india bangladesh series 2022
india bangladesh series 2022

By

Published : Dec 4, 2022, 7:17 PM IST

Updated : Dec 4, 2022, 7:59 PM IST

బంగ్లాదేశ్​తో జరుగుతున్న మొదటి వన్డేలో ఒక వికెట్​ తేడాతో టీమ్​ఇండియా ఓడిపోయింది. 187 పరుగులు లక్ష్యంతో బ్యాటింగ్​కు దిగిన బంగ్లాదేశ్​ మొదట తడబడినా.. తర్వాత తేరుకుని అదరగొట్టింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో.. ముఖ్యంగా టేయిల్​ ఎండ్​ బ్యాటర్లు బంగ్లా జట్టును గెలుపు తీరాలకు నడిపించారు. 46 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగుల లక్ష్యాన్ని చేధించారు.

బంగ్లా బ్యాటర్లలో లిట్టాన్​ దాస్​(41), షకీబ్​ అల్​ హసన్(29) రాణించారు. అనాముల్(14), ముష్​ఫికుర్​ రహీమ్(18), మహ్మదుల్లా(14) ఫర్వాలేదనిపించారు. మెహిడీ హసన్ మిరాజ్(37), ముస్తాఫిజుర్​ రహ్మాన్(10) పరుగులు చేసి ఇరగదీశారు. నజ్​ముల్​ హుస్సేన్(0), అఫీఫ్ హుస్సేన్(6), ఎబడాట్​ హుస్సేన్(0) విఫలమయ్యారు. మహ్మద్​ సిరాజ్​(3) వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేయగా.. వాషింగ్టన్​ సుందర్(2), కుల్దీప్ సెన్(2) వికెట్లు పడగొట్టి అద్భుతంగా ఆడారు. ఇక శార్దుల్​ ఠాకూర్(1), దీపక్​ చాహర్​(1) వికెట్​ చొప్పున తీశారు.

భారత్​ ఇన్నింగ్స్.. అదరగొట్టిన రాహుల్
మొదట బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. టాప్‌ ఆర్డర్‌ విఫలం కాగా.. మిడిల్‌ ఆర్డర్‌లో వచ్చిన కేఎల్ రాహుల్‌ (73) అర్ధ శతకంతో రాణించడంతో భారత్‌ ఈ మాత్రం స్కోరు చేయగలిగింది. రోహిత్ శర్మ (27), శ్రేయస్‌ అయ్యర్‌ (24), వాషింగ్టన్‌ సుందర్‌ (19) పరుగులు చేయగా.. శిఖర్‌ ధావన్ (7), విరాట్ కోహ్లీ (9) నిరాశపర్చారు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో షకీమ్‌ హల్‌ అసన్‌ 5, హొస్సెన్‌ 4 వికెట్లతో ఆకట్టుకోగా.. హసన్‌ మిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.

రికార్డు సృష్టించిన రోహిత్​ శర్మ..
ఈ మ్యాచ్​లో రోహిత్​ శర్మ రికార్డు సృష్టించాడు. భారత వన్డే క్రికెట్​ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆరో ప్లేయర్​గా రికార్డులకెక్కాడు. బంగ్లాదేశ్​తో జరిగిన మొదటి మ్యాచ్​లో.. 31 బంతుల్లో 27 పరుగులు చేసిన రోహిత్​.. టీమ్​ఇండియా మాజీ క్రికెట్​ అజహరుద్దీన్​ పేరును అధిగమించాడు. కాగా, 334 మ్యాచ్​లు ఆడిన అజహరుద్దీన్.. 308 ఇన్నింగ్స్​ల్లో 36.92 సగటుతో 9,378 పరుగులు చేశాడు. అందులో 153* అత్యధిక స్కోరుతో 58 అర్ధ సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. అయితే ఈ రికార్డును.. 234 మ్యాచ్​లు ఆడి, 227 ఇన్నింగ్స్​ల్లో 48.46 సగటుతో 9,403 పరుగులు చేసి అధిగమించాడు రోహిత్ శర్మ. అందులో 264 అత్యధిక స్కోర్​తో 45 ఆర్ధ సెంచరీలు చేశాడు. ఇక సచిన్​ తెందుల్కర్​ (18,426), విరాట్​ కోహ్లీ(12,353), సౌరభ్ గంగూలీ (11,221), రాహుల్​ ద్రవిడ్ (10,768) ఎంఎస్​ ధోనీ (10,599) పరుగులతో మొదటి ఐదు స్థానాల్లో ఉన్నారు.

ఇవీ చదవండి :కోహ్లీ ధోనీ కన్నా సచినే టాప్​ ఇండియన్​​ రిచ్చెస్ట్​ క్రికెటర్స్ వీరే

'క్రికెట్​లో వన్డేలు, టెస్ట్​లు చాలా కీలకం.. టీ20 ఫార్మాట్​ను..'

Last Updated : Dec 4, 2022, 7:59 PM IST

ABOUT THE AUTHOR

...view details