ఆస్ట్రేలియా మహిళా జట్టుతో చారిత్రక డేనైట్ టెస్టులో తలపడేందుకు సిద్ధమైంది భారత మహిళా జట్టు(INDW vs AUSW Test). భారత్‌కు ఇదే తొలి గులాబి బంతి టెస్టు. 2019 తర్వాత ఆస్ట్రేలియాకు ఇదే తొలి టెస్టు కాగా ఈ ఏడాది ఇంగ్లాండ్‌తో టెస్టు డ్రా చేసుకున్న మిథాలీ సేనకు ఇది రెండో టెస్టు. ఇరుజట్లు ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు ప్రణాళికల్ని రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ సమయం, పిచ్ పరిస్థితి వంటి అంశాలు చూద్దాం.
వేదిక: కర్రారా ఓవల్, కర్రారా
తేదీ, సమయం: సెప్టెంబర్ 30-అక్టోబర్ 3, ఉదయం 10గంటల నుంచి ప్రారంభం
ప్రత్యక్ష ప్రసారం - సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్
పిచ్: క్వీన్స్‌లాండ్‌లోని కర్రారా ఓవల్ ఇప్పటివరకు ఒకే ఒక అంతర్జాతీయ మ్యాచ్‌కు అతిథ్యమిచ్చింది. ఈ వేదికలో ఎక్కువగా బిగ్‌బాష్ మ్యాచ్‌లు జరిగాయి. ఈ పిచ్‌పై బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించారు ఆటగాళ్లు. దీంతో ఈ పింక్ టెస్టులో కూడా అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లకు సమాన అవకాశాలు లభిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.