India Asia Games 2023 : చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు 2023లో పాల్గొనేందుకు పురుషుల, మహిళల జట్లను బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్అజిత్ అగార్కర్నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ.. ఈప్లేయర్లను ఎంచుకుంది. పురుషుల జట్టు సారథిగా యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్‌కు బాధ్యతలు అప్పగించింది. ఐపీఎల్ 16వ సీజన్లో తనదైన స్టైల్లో రాణించిన రుతురాజ్.. ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక, మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనుంది.
ఆసియా క్రీడల్లో సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ కెప్టెన్ బాద్యతలువహిస్తాడని ప్రచారం జరిగినప్పటికీ.. సెలక్టర్లు యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో రుతురాజ్ వైపు మొగ్గు చూపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది ఐపీఎల్‌లో రాణించి టీమ్ఇండియా జట్టులో చోటు కోసం ఎదరు చూస్తున్న చాలా మందికి ప్లేయర్లకు సెలెక్టర్లు ఈ జట్టులో అవకాశం ఇచ్చారు. రాజస్థాన్ ప్లేయర్ యశస్వి జైస్వాల్, ముంబయి టీమ్ తిలక్ వర్మ, పంజాబ్ కింగ్స్ జితేశ్ శర్మ, కోల్‌కతా టీమ్ రింకూ సింగ్ లాంటి కీలక ప్లేయర్లకు ఇందులో చోటు దక్కింది.
టీమ్ఇండియా తుది జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముఖే కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్).