తెలంగాణ

telangana

ETV Bharat / sports

న్యూజిలాండ్‌తో సిరీస్​.. కెప్టెన్​గా సంజూ శాంసన్​.. బీసీసీఐ ప్రకటన - కెప్టెన్​గా సంజు శాంసన్​

న్యూజిలాండ్‌- ఏ జట్టుతో జరగబోయే వన్డే సిరీస్‌ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టు ఆటగాళ్ల పేర్లను తెలిపింది బీసీసీఐ. సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది.

sanju samson captain
కెప్టెన్​గా సంజూ శాంసన్​

By

Published : Sep 16, 2022, 4:42 PM IST

Updated : Sep 16, 2022, 5:11 PM IST

న్యూజిలాండ్‌- ఏ జట్టుతో జరగబోయే వన్డే సిరీస్‌ కోసం జట్టును ప్రకటించింది బీసీసీఐ. 16 మంది సభ్యులతో కూడిన జట్టు ఆటగాళ్ల పేర్లను తెలిపింది. చెన్నై వేదికగా జరుగనున్న ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు కేరళ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు వెల్లడించింది.

ఈ టీమ్​లో తెలుగు క్రికెటర్‌, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎస్‌ భరత్‌కు స్థానం దక్కింది. అదే విధంగా హైదరాబాదీ తిలక్‌ వర్మను కూడా చోటు సంపాదించుకున్నాడు. కాగా వీరిద్దరు టెస్టు జట్టుకు కూడా ఎంపికయ్యారు. ఇక యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ సైతం ఈ వన్డే జట్టులో భాగంగా ఉన్నాడు.

జట్టు: సంజూ శాంసన్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, రాహుల్‌ త్రిపాఠి, రజత్‌ పాటిదార్‌, కేఎస్‌ భరత్‌(వికెట్‌ కీపర్‌), కుల్దీప్‌ యాదవ్‌, షాబాజ్‌ అహ్మద్‌, రాహుల్‌ చహర్‌, తిలక్‌ వర్మ, కుల్దీప్‌ సేన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, నవదీప్‌ సైనీ, రాజ్‌ అంగద్‌ బవా.

కాగా మూడు టెస్టు, మూడు వన్డేల అనధికారిక సిరీస్‌ కోసం న్యూజిలాండ్‌ ఏ జట్టు ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తోంది. తొలి రెండు టెస్టులు డ్రాగా ముగియగా.. మూడో టెస్టు రెండో రోజు ఆట కొనసాగుతోంది. ఈ టెస్టు సిరీస్‌ తర్వాత సెప్టెంబరు 22, 25, 27 తేదీల్లో వన్డే సిరీస్‌లో భారత ఏ జట్టు.. కివీస్‌ ఏ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ తమిళనాడులోని చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగనున్నాయి.

ఇదీ చూడండి: ఈ చిత్రంలో ఎన్ని పరుగులు, వికెట్లు ఉన్నాయో చెప్పగలరా?: సచిన్‌

Last Updated : Sep 16, 2022, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details