India Vs Westindies: డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఏ మాత్రం తగ్గకుండా జోరుగా సాగుతోంది. అరంగేట్ర ఆటగాడు యశస్వి జైస్వాల్ తనదైన స్టైల్లో క్రీజులో చెలరేగిపోగా.. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా జట్టుకు మంచి స్కోర్‌నే అందించారు. ఈ ద్వయం బాదిన శతకాలతో ఇన్నింగ్స్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. దీంతో రెండో ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల 312 నష్టానికి పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 162 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం యశస్వి, విరాట్ కోహ్లీ క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్.. 150 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.
శతకొట్టిన ఓపెనింగ్ స్టార్స్.. భారీ ఆధిక్యంతో భారత్..
Indi Vs Wi 2023 : వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తమ సత్తాను చాటుతూ భారీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. రెండో ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. ఆ వివరాలు మీ కోసం..
మరోవైపు ఓవర్ నైట్ స్కోర్ 80/0తో రెండో రోజు ఆటను ఆరంభించిన రోహిత్ సేన.. తొలి సెషన్‌లో కాస్త నెమ్మదించింది. తొలి రోజు కాస్త ధాటిగా ఆడగా.. రోహిత్‌శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ జోడీ రెండో రోజు మాత్రం ఆచితూచి బ్యాటింగ్ చేస్తూ కనిపించింది. కరీబియన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను వేయడం వల్ల భారత ఓపెనర్లు దాదాపు డిఫెన్స్‌కే పరిమితమయ్యారు. సింగిల్స్‌తో స్ట్రెక్‌రోటేట్ చేస్తూ ఛాన్స్ దొరికినప్పుడల్లా కొన్ని షాట్లు కొట్టి స్కోరును 100 పరుగులు దాటించారు. ఈ క్రమంలోనే అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో ఓ పుల్ షాట్‌తో యశస్వి జైస్వాల్ 104 బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఇక జోసెఫ్ బౌలింగ్‌లోనే రోహిత్ ఓ సిక్స్, ఫోర్ బాది ఆ తర్వాత అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో లంచ్ బ్రేక్ సమాయానికి టీమ్‌ఇండియా 146/0తో స్థిరంగా నిలుస్తోంది.
Ind Vs WI: అయితే లంచ్ తర్వాత భారత ఓపెనర్లు కాస్త దూకుడు పెంచారు. జైస్వాల్ కొన్ని మెరుపు షాట్లు ఆడి.. 215 బంతుల్లో టెస్టుల్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత రోహిత్ కూడా 220 బంతుల్లో టెస్టుల్లో పదో శతకాన్ని సాధించాడు. కానీ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాతి బంతికే రోహిత్ శర్మ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ కూడా త్వరగానే పెవిలియన్ బాట పట్టాడు.అథనేజ్ బౌలింగ్‌లో రోహిత్.. ద సిల్వాకు క్యాచ్ ఇవ్వగా.. స్పిన్నర్ వారికన్ బౌలింగ్‌లో స్లిప్‌లో అథనేజ్‌కు చిక్కాడు. దీంతో టీ బ్రేక్ సమయానికి భారత్ 245/2తో నిలిచింది. తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్‌తో కలిసి యశస్వి మిగతా ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. వీరిద్దరూ నిలకడగా సింగిల్స్ తీస్తూ జట్టు స్కోరు 300 దాటించారు. చివరి సెషన్‌లో ఈ జోడీ 67 పరుగులు రాబట్టగలిగింది.