తెలంగాణ

telangana

ETV Bharat / sports

తొలి టీ20 ఇంగ్లాండ్​దే - పోరాడి ఓడిన టీమ్ఇండియా - ఇంగ్లాండ్ వర్సెస్ భారత్ మహిళల టీ20 సిరీస్

Ind W vs Eng W T20 : వాంఖడే వేదికగా భారత్ - ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో టీమ్ఇండియా 38 పరుగుల తేడాతో ఓడింది. దీంతో ఇంగ్లాండ్ మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ind w vs eng w t20
ind w vs eng w t20

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2023, 10:14 PM IST

Updated : Dec 6, 2023, 10:28 PM IST

Ind W vs Eng W T20 :మూడు టీ20ల సిరీస్​లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్​లో ఇంగ్లాండ్ మహిళల జట్టు చేతిలో భారత్ ఓడింది. 198 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దిగిన టీమ్ఇండియా మహిళల జట్టు, 20 ఓవర్లలో 159 - 6కే పరిమిమైంది. దీంతో తొలి మ్యాచ్​లో ఇంగ్లాండ్ 38 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమ్ఇండియాలో ఓపెనర్ షఫాలీ వర్మ (52 పరుగులు) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా, కెప్టెన్ హర్మన్​ప్రీత్ కౌర్ (26), రిచా ఘోష్ (21) ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడం వల్ల టీమ్ఇండియాకు ఓటమి తప్పలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో సోఫీ 3, సారా గ్లెన్, ఫ్రెయా కెంప్, నాట్ సీవర్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో ఇంగ్లాండ్ మూడు మ్యాచ్​ల సిరీస్​లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.

భారీ లక్ష్య ఛేదనలో టీమ్ఇండియాకు పవర్​ ప్లేలోనే దెబ్బ తగిలింది. ఓపెనర్ స్మృతి మంధాన (6), జెమిమా రోడ్రిగ్స్​ (4) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఈ స్థితిలో మరో ఓపెనర్ షఫాలీతో కలిసి కెప్టెన్ హర్మన్, ఇన్నింగ్స్​ను గాడీలో పెట్టింది. వీళ్లు క్రీజులో ఉండగా భారత్, 10 ఓవర్లకు 82-2తో నిలిచింది. ఈ దశలో టీమ్ఇండియా పుంజుకున్నట్లు అనిపించింది. కానీ, తర్వాతి ఓవర్లోనే సోఫీ, హర్మన్​ను పెవిలియన్ చేర్చి షాకిచ్చింది. తర్వాత వచ్చిన రిచా ఘేష్ కూడా వేగంగా అడే ప్రయత్నం చేసింది. ఇక స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔటయ్యారు. దీంతో టీమ్ఇండియా ఓటమి దాదాపు ఖాయమైంది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన, ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. డేనియల్‌ వ్యాట్‌ (75 పరుగులు), నాట్‌ సీవర్‌ (77 పరుగులు) హాఫ్ సెంచరీలు చేయడం వల్ల ప్రత్యర్థి జట్టు, టీమ్ఇండియా ముందు భారీ టార్గెట్​ఉంచింది. భారత బౌలర్లలో రేణుకా సింగ్ 3, శ్రేయాంక పాటిల్ 2, సైకా ఇషాక్‌ ఒక వికెట్ పడగొట్టారు.

wpl auction 2023 : కెప్టెన్​ను దాటేసిన స్మృతి మంధాన.. రూ. కోట్లు పలికిన ప్లేయర్లు వీళ్లే

మరోసారి భారత్-శ్రీలంక ఫైనల్ మ్యాచ్.. ఈసారి కూడా వదిలేదేలే!

Last Updated : Dec 6, 2023, 10:28 PM IST

ABOUT THE AUTHOR

...view details