తెలంగాణ

telangana

ETV Bharat / sports

అమ్మాయిలు భళా- తొలి టీ20లో ఆసీస్​పై గ్రాండ్ విక్టరీ - భారత్ మహిళల టీ20 సిరీస్

Ind w vs Aus w T20: ముంబయి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత మహిళలు ఘన విజయం సాధించారు. 142 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్ కోల్పోయి 17.3 ఓవర్లలో ఛేదించారు.

ind w vs aus w t20
ind w vs aus w t20

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2024, 9:56 PM IST

Updated : Jan 5, 2024, 10:25 PM IST

Ind w vs Aus w T20: భారత్- ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య జరిగిన తొలి టీ20లో టీమ్ఇండియా గెలుపొందింది. మ్యాచ్​లో పూర్తిగా ఆధిపత్యం చలాయించిన టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో నెగ్గింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని, టీమ్ఇండియా ఒక వికెట్ కోల్పోయి 17.3 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (54 పరుగులు: 52 బంతుల్లో, 7x4, 1x6), షఫాలీ వర్మ (62*పరుగులు: 44 బంతుల్లో, 6x4, 3x6) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఆసీస్ బౌలర్లలో వేర్​​హమ్ ఒక వికెట్ దక్కించుకుంది. నాలుగు వికెట్లతో ఆసీస్​ను దెబ్బకొట్టిన టిటాస్ సాధుకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ విజయంతో మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో 1-0 తో భారత్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

లక్ష్య ఛేదనలో టీమ్ఇండియా ఓపెనర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. ప్రత్యర్థి బౌలింగ్​పై ఎదురుదాడికి దిగి బౌండరీలతో విరుచుకుపడ్డారు. ఆసీస్ బౌలర్లు స్మృతి, షఫాలిని ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. ఓపెనర్లిద్దరూ క్రీజులో స్వేచ్ఛగా కదులుతూ బౌండరీలు బాదారు. ఈ క్రమంలోనే షఫాలీ 11.3 ఓవర్ వద్ద 32 బంతుల్లో 50 పరుగుల మార్క్ అందుకుంది. కాగా, షఫాలికి ఇది కెరీర్​లో 8వ హాఫ్​ సెంచరీ. మరోవైపు స్మృతి కూడా 50 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. వీరిద్దరి మధ్య 15.2 ఓవర్లలో 137 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ఇక వేర్​హమ్ అద్భుత బంతితో స్మృతిని ఔట్ చేసింది. కానీ, అప్పటికే టీమ్ఇండియా విజయం దాదాపు ఖరారైంది. వన్​డౌన్​లో వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ (6*) మరో వికెట్ పడకుండా చూసుకుంది.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన ఆసీస్ 19.2 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు హేలీ (8 పరుగులు), మూనీ (17 పరుగులు) విఫలం కాగా, వన్​డౌన్​లో వచ్చిన తహిళ మెక్​గ్రాత్ (0), గార్డ్​నర్ (0) పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ఇక ఎల్లిస్ పెర్రీ (37 పరుగులు: 30 బంతుల్లో, 2x2, 2x6), ఫోబ్ లిచ్​ఫీల్డ్ (49 పరుగులు 32 బంతుల్లో, 4x2, 3x6) రాణించడం వల్ల ఆసీస్ 140 పరుగుల మార్క్ అదుకోగలిగింది. భారత బౌలర్లలో టిటాస్ సాధు 4, శ్రేయంక పాటిల్, దీప్తి శర్మ తలో 2, అమన్​జోత్ కౌర్, రేణుకా సింగ్ తలో ఒక వికెట్ దక్కించుకున్నారు.

ఏకైక టెస్ట్ మ్యాచ్​లో టీమ్ఇండియాదే పైచేయి- 347పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ చిత్తు

ఆఖరి మ్యాచ్​లో విజృంభించిన అమ్మాయిలు- 5 వికెట్ల తేడాతో భారత్ విజయం

Last Updated : Jan 5, 2024, 10:25 PM IST

ABOUT THE AUTHOR

...view details