Ind W Tour Of Bangladesh 2023 : ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో టీమ్ఇండియా మహిళల జట్టు.. బంగ్లాదేశ్‌పై రెండో వన్డేలో 108 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా నిర్ణిత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్ జట్టును 120 పరుగులకే ఆలౌట్ చేసింది. తన ఆల్‌రౌండ్ ప్రదర్శన (86 పరుగులు, 4 వికెట్లు)తో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించిన 'జెమిమా రోడ్రిగ్స్'కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డు లభించింది. టీమ్ఇండియా బౌలర్లలో.. దేవికా వైద్య 3, మేఘన సింగ్, దీప్తీ శర్మ, స్నేహ్ రానా తలో వికెట్ తీశారు. కాగా ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను హర్మన్ సేన 1-1తో సమం చేసింది.
Ind W vs Ban W Odi : ఢాకా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో.. మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా మహిళల జట్టుకు ఘనమైన ఆరంభమేమీ దక్కలేదు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లలోనే ఓపెనర్ ప్రియా పునియా (7) ఔట్ అయ్యింది. వన్ డౌన్లో వచ్చిన యస్తికా (15) కూడా త్వరగానే రనౌట్ రూపంలో వెనుదిరిగింది. దీంతో భారత్ 10.1 ఓవర్లలో రెండు కీలక వికెట్లు చేజార్చుకుంది. మరో ఓపెనర్ స్మృతి మంధాన (36) టచ్‌లోకి వచ్చిందనుకునేలోపే.. రబియా ఖాన్ తనను క్లీన్‌బౌల్డ్ చేసింది. ఈ దశలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ (52).. ఆల్‌రౌండర్ జెమిమా (86) తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకుంది. హర్మన్ నెమ్మదిగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేయగా.. ఇంకో ఎండ్‌లో ఉన్న జెమిమా రఫ్పాడించింది. బంగ్లా బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడింది. చివర్లో ఈ జోడి పెవిలియన్ చేరడం వల్ల భారత్ 228 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది.