Teamindia celebrations with wifes: వరుసగా సిరీస్‌లు గెలిచిన ఆనందంలో టీమ్‌ఇండియా ఆటగాళ్లు మంచి జోష్ మీద ఉన్నారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్, విండీస్ ఇలా సిరీస్ నెగ్గిన ప్రతిసారీ టీమ్‌ఇండియా ప్లేయర్స్ ఏదో ఒకరకంగా విన్నింగ్ సెలబ్రేషన్స్‌ను సోషల్‌మీడియాలో పోస్టు చేస్తున్నారు. తాజాగా విండీస్‌తో వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేశాక.. కెప్టెన్ ధావన్ డ్రెస్సింగ్ రూమ్‌లో సరదాగ 'మనం ఎవరు ? మనమంతా ఛాంపియన్స్' అంటూ గట్టిగా అరుస్తున్న వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఆ సమయంలో మిగిలిన ఆటగాళ్లు నవ్వుతూ కనిపించారు. దీనికి ముందు కోచ్ ద్రవిడ్ మాట్లాడుతూ జట్టును సమర్ధంగా నడిపించిన ధావన్‌ను అభినందించగా, ధావన్ యువ క్రికెటర్లకు అభినందనలు తెలిపాడు. అయితే, డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలాంటి సంభాషణలు, సంబరాలు సాధారణమే.
విండీస్ దీవుల్లో టీమ్‌ఇండియా ప్లేయర్స్.. భార్యలతో కలిసి చిల్ కొడుతూ.. - టీమ్‌ఇండియా సెలబ్రేషన్స్
Teamindia celebrations with wifes: ఐర్లాండ్, ఇంగ్లాండ్, విండీస్ ఇలా వరుసగా ప్రత్యర్థులపై సిరీస్‌లు గెలిచిన ఆనందంలో టీమ్‌ఇండియా ప్లేయర్స్ చిల్ కొడుతున్నారు. ప్రస్తుతం విండీస్ దీవుల్లో తమ భార్యలతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
కానీ బయట క్రికెటర్లు ఏం చేస్తున్నారో అని అభిమానులు వారిని సోషల్‌మీడియాలో ఫాలో అవుతూఉంటారు. అయితే, వన్డే సిరీస్‌ను విజయవంతంగా ముగించిన రేపటినుంచి పొట్టి సిరీస్ ఆడనుంది. ఈ లోగా కరేబియన్ దీవుల్లో మనోళ్లు చక్కర్లు కొడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను దేవిషా శెట్టి( సూర్య కుమార్ భార్య) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టుచేసింది . టీమ్‌ఇండియా ఆటగాళ్లు తమ సతీమణులతో కలిసి విండీస్ దీవుల్లో ట్రావెల్ చేస్తున్నారు. ఈ వీడియోలో టీమ్‌ఇండియా క్రికెటర్లు సరదాగ స్మిమ్మింగ్ చేస్తూ, యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, అవేశ్ ఖాన్ మేకప్ వేసుకుంటూ కనిపించారు. బిజీ షెడ్యూల్ కారణంగా తీరికలేని క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లు దొరికిన ఈ కొద్ది సమయాన్ని ఇలా ఆస్వాదిస్తున్నారు.
ఇదీ చూడండి: హిట్‌మ్యాన్ రికార్డ్ బ్రేక్ చేసిన కివీస్ ప్లేయర్.. టీ20ల్లో టాపర్‌గా