Ind Vs WI T20 : టీమ్ఇండియా @200.. టీ20ల్లో మన స్టార్ ప్లేయర్ల రికార్డులు తెలుసా? - ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20 రికార్డులు
Ind Vs WI T20 : తన 18 ఏళ్ల టీ20 క్రికెట్ చరిత్రలో టీమ్ఇండియా జట్టు తాజాగా 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. ఇటీవలే వెస్టిండీస్‌తో జరిగిన టీ20 వేదికగా భారత ప్లేయర్లు ఈ రికార్డును తమ పేరిట రాసుకుంది. ఈ నేపథ్యంలో భారత ప్లేయర్లు.. నెలకొల్పిన అరుదైన రికార్డులను ఓ సారి తెలుసుకుందాం.
Ind Vs WI T20 : వెస్టిండీస్ పర్యటనలో తొలి టీ20 ఆడిన టీమ్ఇండియా.. పొట్టి ఫార్మాట్లో 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. 2006 సౌతాఫ్రికా సిరీస్‌లో మాజీ బ్యాటర్ వీరేందర్ సెహ్వాగ్ సారధ్యంలో భారత్ తొలి టీ20 మ్యాచ్ ఆడింది. మొదటి మ్యాచ్‌లోనే ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది టీమ్ఇండియా. ఇక 200 మ్యాచ్‌లకు గాను 127 సార్లు నెగ్గిన భారత్.. 64 మ్యాచ్‌ల్లో ఓడింది. నాలుగింటిని డ్రా గా ముగించింది. ఐదింట్లో ఫలితం తేలలేదు. ఈ క్రమంలో భారత్ తరఫున కొన్ని అరుదైన రికార్డులు సాధించిన ప్లేయర్లపై ఓ లుక్కేద్దాం.
- అత్యధిక వ్యక్తిగత స్కోర్..
టీ20ల్లో 2023లో అరంగేట్రం చేసిన యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్.. న్యూజిలాండ్‌పై అజేయ శతకం (126*) సాధించాడు. అయితే గిల్ చేసిన 126 పరుగులే ఇప్పటివరకు టీమ్ఇండియాలో అత్యధిక వ్యక్తిగత స్కోర్. - అత్యధిక పరుగులు..
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. టీ20ల్లో 115 మ్యాచ్‌ల్లో కలిపి 4008 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీ20ల్లో ఎక్కువ పరుగులు చేసి టాప్‌లో ఉన్నాడు. వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఈ లలిస్ట్లో లిస్ట్‌లో 3853 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. - టాప్ వికెట్లు..
స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 76 మ్యాచ్‌ల్లో కలిపి 93 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉన్నాడు. అతడి తర్వాత పేసర్ భువనేశ్వర్ కుమార్ 90 వికెట్లతో రెండో ప్లేస్‌లో ఉన్నాడు. - బెస్ట్ ఎకనమీ..
టీ20ల్లో కనీసం 25 మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లలో హర్భజన్ సింగ్ 6.20 ఎకమీతో టాప్‌లో కొనసాగుతున్నారు. - బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్..
పేసర్ దీపక్ చాహర్ 7 పరుగులిచ్చి 6 వికెట్లు (6/7) తీశాడు. ఇది భారత్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. - అత్యధిక సిక్సర్లు..
టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. టీ20ల్లో 182 సిక్సర్లు సంధించాడు. ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉన్నాడు. - అత్యుత్తమ స్ట్రయిక్ రేట్..
టీ20 స్ట్రయిక్ రేట్లో 360 డిగ్రీల ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌దే హవా. అతడు 49 మ్యాచ్‌ల్లో కలిపి 174 స్ట్రయిక్ రేట్‌తో 1696 పరుగులు చేశాడు.