IND vs WI T20 Squad: వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు టీమ్ఇండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. రోహిత్ సారథ్యంలో జరగనున్న ఈ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, బుమ్రాలు దూరం కానున్నారు. గత కొన్నాళ్లు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న విరాట్‌కు ఈ సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ ఆడే అవకాశం ఉంది. అయితే ఇటీవల సర్జరీ చేయించుకున్న రాహుల్ ఈ సిరీస్‌లో ఆడటం అతడి ఫిట్నెస్పైన ఆధారపడి ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. తీరిన లేకుండా క్రికెట్ ఆడుతున్న బుమ్రాకు కూడా రెస్ట్ ఇస్తున్నట్లు తెలిపింది. జట్టులో చోటు దక్కించుకున్న మరో ఆటగాడు కుల్దీప్ యాదవ్‌ను కూడా ఫిట్నెస్ చూసి తుదిజట్టులో చోటుకల్పిస్తామని పేర్కొంది.
విండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ఇదే.. కోహ్లీ, బుమ్రా దూరం - విరాట్ కోహ్లీ
IND vs WI T20 Squad: విండీస్ పర్యటనకు టీమ్ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. 18 మంది సభ్యుల బృందం గల ఈ జట్టులో విరాట్ కోహ్లీ, బుమ్రాలకు స్థానం దక్కలేదు. వారికి విశ్రాంతి కల్పిస్తున్నట్లు బోర్డు పేర్కొంది.
విరాట్ కోహ్లీ
విండీస్ పర్యటనకు టీమ్ఇండియా జట్టు ఇదే: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తిక్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, బిష్ణోయ్, అశ్విన్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఆవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్.
ఇదీ చూడండి :వన్డేల్లో బుమ్రా మళ్లీ నంబర్ వన్.. టీ20లో 5వ స్థానానికి సూర్య