టీమ్‌ఇండియా యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఫామ్‌లోకి వచ్చాడు. కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న అతడు.. వెస్టిండీస్‌పై బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు చేసి సత్తాచాటాడు. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో సంజూ శాంసన్‌తో కలిసి 99 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి టీమ్‌ఇండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే, ఇన్నింగ్స్ 33వ ఓవర్ అల్‌జారీ జోసెఫ్ బౌలింగ్‌లో అయ్యర్ (71 బంతుల్లో 63; 4 పోర్లు, 1 సిక్సర్ ) ఎల్బీ రూపంలో పెవిలియన్ చేరాడు.
అయితే తన ప్రదర్శనపై మాట్లాడిన అతడు.. "నేను సాధించిన పరుగులతో సంతోషిస్తున్న..అయితే నేను ఔట్ అయిన విధానం నన్ను నిరాశకు గురిచేసింది. జట్టుకు విజయాన్ని అందించేంతవరకు క్రీజ్‌లో ఉంటానని అనుకున్నా..కానీ, దురదృష్టవశాత్తు ఔట్ అయ్యాను. తరవాతి మ్యాచ్‌లో శతకం సాధిస్తానని భావిస్తున్నా" అని తెలిపాడు.