Dhawan Iyer: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు కరోనా బారినపడ్డ భారత ఓపెనర్ శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్‌కు.. కొవిడ్ నెగెటివ్‌గా తేలింది. ఇరువురికీ ప్రాక్టీస్ చేసుకొనే వెసులుబాటు కల్పించింది బీసీసీఐ.
''శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్‌కు కరోనా నెగెటివ్‌గా నిర్ధరణ అయింది. వారు ఇక ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రుతురాజ్ గైక్వాడ్ మాత్రం ఇంకా ఐసోలేషన్‌లో ఉన్నాడు.''
- అధికార వర్గాలు
Ind vs Wi Odi: ఫిబ్రవరి 9న రెండో వన్డేకు ముందు.. మంగళవారం(ఫిబ్రవరి 8) సాయంత్రం ప్రాక్టీస్ చేయనుంది టీమ్ఇండియా. ధావన్, అయ్యర్.. ఈ సెషన్లో పాల్గొంటారని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి.
తొలి వన్డేకు ముందు.. ధావన్, అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, బౌలర్ నవదీప్ సైనీలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఫీల్డింగ్ కోచ్ దిలీప్ సహా మరో ఇద్దరు సహాయక సిబ్బంది కూడా వైరస్ బారిన పడ్డారు. దీంతో వీరంతా ఆ మ్యాచ్‌కు దూరమయ్యారు. అయినా.. భారత్ ఘనవిజయం సాధించింది. వీరి గైర్హాజరీలో ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ హుడాలకు ఆడే అవకాశం లభించింది.
వెస్టిండీస్‌ను 176 పరుగులకే ఆలౌట్ చేసి.. 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత చాహల్ 4, వాషింగ్టన్ సుందర్ 3.. స్పిన్ మాయాజాలంతో విండీస్ కుప్పకూలింది. అనంతరం.. బ్యాటింగ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ(60) అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. అనంతరం వరుసగా వికెట్లు పోయినా.. సూర్యకుమార్ యాదవ్, హుడా విజయాన్ని అందించారు.
రెండో వన్డే 9న, మూడో వన్డే 11న అహ్మదాబాద్‌లో.. టీ20లు ఫిబ్రవరి 16, 18, 20న కోల్‌కతాలో జరుగుతాయి.
ఇవీ చూడండి:గంగూలీ సలహాను పక్కనపెట్టిన హార్దిక్..
IPL 2022: ప్రపంచకప్ గెలిచినా వేలానికి అనర్హులే! ఎందుకంటే..?