Rohit Sharma New Record: టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ కొత్త చరిత్ర సృష్టించాడు. టీమ్‌ఇండియా తరఫున మూడు, అంతకన్నా ఎక్కువ సిరీస్‌లు వైట్‌వాష్ చేసిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. గతరాత్రి వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20లో భారత్ 17 పరుగులతో విజయం సాధించి 3-0 తేడాతో పొట్టి సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. అంతకుముందు వన్డే సిరీస్‌ను కూడా 3-0 తేడాతోనే కైవసం చేసుకుంది. దీంతో ఈ పర్యటనలో కరీబియన్ జట్టు ఒక్క విజయం సాధించకుండానే ఇంటిముఖం పట్టింది. మరోవైపు రోహిత్ కెప్టెన్సీలో టీమ్‌ఇండియా ఇదివరకు మూడు సార్లు ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. 2017లో శ్రీలంకపై, 2018లో వెస్టిండీస్‌పై, 2021లో న్యూజిలాండ్‌పై అన్ని మ్యాచ్‌లూ గెలుపొందింది.
- గత నాలుగు టీ20 సిరీస్‌ల్లో వెస్టిండీస్‌పై టీమ్‌ఇండియా ప్రదర్శన..
2018లో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో టీమ్‌ఇండియా 3-0తో విజయం.
2019లో వెస్టిండీస్ పర్యటనలోనూ 3-0తో గెలుపు.
2019లో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ 2-1తో విజయం.
2022లో స్వదేశంలోనే 3-0తో సిరీస్ కైవసం.
- టీ20ల్లో టీమ్‌ఇండియాకు అత్యధిక సార్లు వరుస విజయాలు సాధించిన సందర్భాలు..