IND VS WI RishiDhawan: దక్షిణాఫ్రికా పర్యటనలో ఓటమి చెందిన టీమ్ఇండియా.. స్వదేశంలో వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. ఈ సిరీస్‌కు గాయం నుంచి కోలుకున్న రోహిత్‌శర్మ అందుబాటులోకి రానుండగా.. దేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఆల్‌రౌండర్ రిషి ధావన్, షారుక్ ఖాన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి
458 పరుగులు.. 17 వికెట్లు
విజయ్‌హజారే ట్రోఫీలో హిమ్చల్ ప్రదేశ్ కెప్టెన్ రిషి ధావన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ టోర్నీలో మొత్తంగా 458 పరుగులు సహా 17 వికెట్లు తీశాడు. ఇందులో నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి.
రిషి.. 2016లో ధోనీ సారథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. మూడు వన్డేలు, ఓ టీ20 ఆడాడు. తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాపై ఆడగా.. అదే ఏడాది చివరిగా జింబాబ్వేపై ఆడాడు. ఆ తర్వాత అతడికి అంతగా అవకాశాలు రాలేదు. ఇప్పుడు దేశవాళీ టోర్నీలో అతడు బాగా రాణించిన నేపథ్యంలో అతడికి అవకాశం ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నారు. ఒకవేళ అతడు ఎంపిక అయితే సుదీర్ఘకాలం ఆరేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినట్టవుతుంది.
ఆఖరి బంతికి సిక్స్