Ind Vs Wi Odi 2023 Schedule : ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ సమీపిస్తున్న వేళ.. టీమ్ఇండియా ప్రయోగాలు చేయడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. విండీస్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో.. పూర్తిగా బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చి అతి కష్టం మీద గట్టెక్కింది టీమ్ఇండియా. ఇక రెండో వన్డేలో కీలక ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండానే జట్టు బరిలోకి దిగింది. మ్యాచ్‌కు ముందు ఈ నిర్ణయాన్ని కొంతమంది సమర్దించినా.. మొదటి ఇన్నింగ్స్ తర్వాత ఈ ప్రయోగం ఫలితం అందర్నీ నిరాశపర్చింది.
అయితే యంగ్ ప్లేయర్లకు ఎక్కువ అవకాశాలు కల్పించేందుకే ఈ ప్రయత్నం చేశామని కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపారు. గతంలో కూడా టీమ్ఇండియా కీలక సమయంలో ఇలాంటి ప్రయోగాలు చేసి విఫలమయ్యింది. ఇప్పుడు మళ్లీ అదే విధానాన్ని అనుసరిస్తున్న బీసీసీఐపైసదరు క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
2022 T20 World Cup : గతేడాది భారత్ ఆడిన పలు సిరీస్‌లకు టీమ్ఇండియా ఒక్కో జట్టుతో బరిలోకి దిగింది. ఇలా చేయడం వల్ల స్టార్ ఆటగాళ్లపై పడే ఒత్తిడిని తగ్గించవచ్చని మేనేజ్మెంట్ భావించింది. కానీ ఈ ప్రయోగం వల్ల 2022 ఆసియా కప్, 2022 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు నిరాశే మిగిలింది.
ఈసారైనా.. ఇక భారత్ 2013లో ఐసీసీ (ఛాంపియన్స్ ట్రోఫీ) ట్రోఫీ నెగ్గింది. ఆ తర్వాత జరిగిన ఐసీసీ ఈవెంట్లో ఏ ఒక్కదాంట్లో కూడా భారత్ టైటిల్ సాధించలేదు. ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత మళ్లీ వన్డే ప్రపంచకప్‌నకు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మెగా టోర్నీలో భారత్ హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగనుంది.
మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలకు ఇదే చివరి వరల్డ్ కప్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేనేజ్మెంట్.. ఎలాంటి ఉపయోగం లేని ప్రయోగాలు చేయకూడదని బీసీసీఐకు విన్నవిస్తున్నారు ఫ్యాన్స్. స్టార్ బ్యాటర్లు విరాట్, రోహిత్‌ను జట్టులో ఆడిస్తూ.. మెగాటోర్నీల్లో ఆడే ప్లేయర్లను ఆడిస్తే వారికీ తగిన ప్రాక్టీస్ దొరుకుతుందని పలువురు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Teamindia Injured Players : అయితే జట్టు కూర్పులో ఓ ప్రశ్న.. బీసీసీఐని ఇరకాటంలో పడేస్తుంది. గాయాల కారణంగా జట్టుకు దూరమై.. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో కోలుకుంటున్నవారి పరిస్థితేంటి? వారు పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించి అందుబాటులోకి వస్తే మేనేజ్మెంట్.. జట్టును ఎలా బ్యాలెన్స్ చేస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. బౌలింగ్ విభాగంలో కీలకమైన బుమ్రా విషయంలో ఎలాంటి డౌట్ లేదు.. అతడు కచ్చితంగా జట్టులో ఉంటాడు. కానీ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరిలో ఎవరు రీ ఎంట్రీ ఇస్తారో అన్నది కీలకం. ఒకవేళ ఇద్దరూ జట్టులోకి వస్తే.. ఇప్పుడున్నవారిలో ఎవరిపై వేటు పడుతుందో చెప్పలేం.
India Bowling Team : మరోవైపు టీమ్ఇండియాను బౌలింగ్ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఫామ్‌లో లేని విండీస్‌పై స్టార్ బౌలర్ సిరాజ్ ఎందుకంటూ.. అతడిని భారత్‌కు తిరిగి పంపించేశారు. అతడి స్థానంలో ముకేశ్ కుమార్ అరంగేట్రం చేసి ఫర్వాలేదనిపిస్తున్నాడు. కానీ స్పీడ్ గన్ ఉమ్రన్ మాలిక్ నిరాశపరుస్తున్నాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య రెండు విభాగాల్లో విఫలమౌతున్నాడు. ఇక జడేజా, కుల్దీప్, చాహల్, అక్షర్‌తో టీమ్ఇండియాకు స్పిన్ విభాగంలో సమస్యలేదు. అయితే ఇకనైనా ప్రయోగాలకు పోకుండా.. ఆసియా కప్ సమయానికి జట్టును పటిష్ఠంగా సిద్ధం చేయాలని ఫ్యాన్స్ నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.