తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇట్స్ 'వన్డే సిరీస్​' టైమ్​..కోహ్లీ-రోహిత్​-గిల్​ను ఊరిస్తున్న రికార్డులివే! - ఇండియా వర్సెస్​ వెస్టిండీస్ వేదిక

India Vs Westindies : విండీస్​ సేనతో జరిగిన టెస్టు సిరీస్‌లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన రోహిత్‌ సేన.. రానున్న వన్డే సిరీస్​లోనూ సత్తా చేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో గురువారం జరగనున్న తొలి వన్డేలో కొన్ని రికార్డులు మన ప్లేయర్స్​ను ఊరిస్తున్నాయి. అవేంటంటే..

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 27, 2023, 11:46 AM IST

India Vs Westindies ODI : కరీబియన్‌ వేదికగా జరిగిన టెస్టు సిరీస్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించిన రోహిత్‌ సేన.. వన్డే సిరీస్​లోనూ ప్రత్యర్థలను చిత్తు చేసేందుకు సిద్ధమైంది. ఇక గురువారం నుంచి మొదలవ్వనున్న ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి పోరుకు మరి కొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. ఇప్పటి వరకు టెస్టుల్లో భారత్‌ ధాటికి నిలవలేకపోయిన విండీస్​ సేన.. వన్డేల్లో ఏమాత్రం పోరాడుతుందన్న విషయం పై క్రికెట్​ లవర్స్​లో సందేహం నెలకొంది. అయితే వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు చివరి రెండు రోజుల్లో వర్షం కారణంగా 1-0 తేడాతో సిరీస్​ను సరిపెట్టుకోవాల్సి వచ్చింది భారత్​. లేకుంటే ఆ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమ్‌ఇండియా క్లీన్‌స్వీప్‌ చేసేదే.

మరోవైపు ప్రత్యర్థి జట్టు నుంచి సిరీస్‌లో ఏమాత్రం పోటీ ఎదురవ్వనున్న విషయాన్ని పక్కనపెడితే.. భారత తుది జట్టులో చోటు కోసం మన ఆటగాళ్లు గట్టిగానే పోటీ పడుతున్నారు. ప్రపంచకప్‌ జట్టులో చోటే దక్కించుకోవడమే లక్ష్యంగా కొందరు యువ ఆటగాళ్లు ఈ సిరీస్‌లో సత్తా చాటేందుకు కసరత్తులు చేస్తున్నారు. టీ20ల్లో అదరగొట్టిన సూర్యకుమార్‌ యాదవ్‌.. వన్డేల్లో తన సత్తా ఇంకా చాటలేదు. గతంలో దక్కిన అవకాశాలను అతను ఏ మాత్రం ఉపయోగించుకోలేకపోయాడు. కానీ శ్రేయస్‌ అయ్యర్‌ అందుబాటులో లేనందున అతడికి తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే సిరీస్‌లో సూర్యకుమార్​ తనదైన ముద్ర వేయకుంటే ప్రపంచకప్‌లో ఆడటంపై ఆశలు వదులుకోవాల్సిందే.

Ind Vs WI 2023 : ఇక వికెట్‌ కీపర్‌ స్థానం కోసం ఇషాన్‌ కిషన్‌తో పాటు సంజు శాంసన్‌ పోటీ పడుతున్నాడు. ఇప్పటికే వన్డేల్లో డబుల్‌ సెంచరీతో పాటు కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన ఇషాన్‌ను ఎంచుకుంటారా లేకుంటే సంజును ఆడిస్తారా అన్నది వేచి చూడాల్సిందే. అయితే తుది జట్టులో స్థానంపై శార్దూల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, జైదేవ్‌ ఉనద్కత్‌లతో పాటు కొత్త బౌలర్‌ ముకేశ్‌ కుమార్‌ కూడా కన్నేశారు . జడేజాకు తోడుగా రెండో స్పిన్నర్‌గా అక్షర్‌ పటేల్‌ను ఆడిస్తారా లేకుంటే కుల్‌దీప్‌ను ఎంచుకుంటారా అన్నది కూడా సన్పెన్స్​లో ఉంది. బ్యాటింగ్‌లో టాప్‌-3 బ్యాటర్లైన రోహిత్‌, శుభ్‌మన్‌, కోహ్లిలపై మంచి అంచనాలే ఉన్నాయి. దీంతో వీరి నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తోంది. చాన్నాళ్ల తర్వాత వన్డే ఆడనున్న టీ20 కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య నుంచి కూడా ఇదే తరహా మెరుపులు కోరుకుంటున్నారు అభిమానులు. ఇక బౌలింగ్‌లో సిరాజ్‌, శార్దూల్‌, జడేజా కీలకం కానున్నారు.

వెస్టిండీస్​తో ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో నమోదైన రికార్డులు ఏంటంటే..

  • వెస్టిండీస్‌పై వన్డేల్లో విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉంది. 41 ఇన్నింగ్స్‌లలో 66.50 సగటుతో 2261 పరుగులు స్కోర్​ చేశాడు. అందులో 9 సెంచరీలతో పాటు 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు బౌలింగ్​లోనూ రవీంద్ర జడేజా మంచి ఫామ్​తో ఆకట్టుకున్నాడు. ఆడిన జడేజా 29 ఇన్నింగ్స్‌లలో 41 వికెట్లు పడగొట్టి అరుదైన రికార్డును నెలకొల్పాడు.
  • విదేశాల్లో సిరాజ్‌ వన్డే బౌలింగ్‌ సగటు 20.72. కనీసం 40 వికెట్లు తీసిన భారత బౌలర్లలో అతడిదే ఉత్తమ ప్రదర్శన. సిరాజ్‌ 24 వన్డేల్లో 43 వికెట్లు పడగొట్టాడు.
  • వెస్టిండీస్‌తో ఆడిన చివరి 8 వన్డేల్లోనూ భారత్‌దే విజయం. చివరగా 2019లో విండీస్‌ చేతిలో చెన్నైలో ఓడింది.

ఇక ఈ వన్డే వేదికగా పలు రికార్డులు నమోదు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అవేంటంటే..

  • వన్డేల్లో 13,000 పరుగులు పూర్తి చేసిన ఐదో ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డుకెక్కేందుకు అతనికి 102 పరుగులు కావాలి.
  • అంతర్జాతీయ క్రికెట్‌లో 2,500 పరుగులు పూర్తి చేయడానికి శుభమన్ గిల్ (2,479) 21 పరుగులు స్కోర్ చేయాల్సి ఉంది.
  • వన్డేల్లో 10,000 పరుగులు పూర్తి చేసేందుకు రోహిత్ శర్మకు (9,825) 175 పరుగులు కావాలి.
  • వెస్టిండీస్‌పై వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన కపిల్ దేవ్‌ రికార్డును అధిగమించేందుకు రవీంద్ర జడేజాకు (41)కు మరో 3 వికెట్లు కావాలి.
  • వన్డేల్లో 50 స్కోర్లు పూర్తి చేసేందుకు మహ్మద్ సిరాజ్ (43)కి ఇంకా 7 వికెట్లు కావాలి.
  • వన్డేల్లో 1,500 పరుగులు పూర్తి చేయడానికి వెస్టిండీస్​ ప్లేయర్​ షిమ్రాన్ హెట్మెయర్ (1,497)కి 3 పరుగులు కావాలి.
  • వన్డేల్లో 1,000 పరుగులు పూర్తి చేయడానికి వెస్టిండీస్​ ప్లేయర్​ రోవ్‌మన్ పావెల్ (975) 25 పరుగులు చేయాలి.
  • వన్డేల్లో 5,000 పరుగులు పూర్తి చేసేందుకు షాయ్ హోప్ (4,829)కు 171 పరుగులు అవసరం.
  • వెస్టిండీస్‌లో వన్డేల్లో 50 స్కోర్లు పూర్తి చేయడానికి అల్జారీ జోసెఫ్ (47)కి 3 వికెట్లు అవసరం.

ABOUT THE AUTHOR

...view details