తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND Vs WI : విండీస్‌తో తొలి టెస్టు.. 'తండ్రీకొడుకు'ల ఘనతను కోహ్లీ సాధిస్తాడా? - virat kohli sachin records

IND Vs WI Kohli : మరో రెండు రోజుల్లో వెస్టిండీస్​తో తొలి టెస్ట్​ ప్రారంభమవ్వనున్న నేపథ్యంలో టీమ్​ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. అరుదైన రికార్డు ముందు నిలిచాడు. విండీస్‌ తుది జట్టు కూర్పుపై కోహ్లీ ఈ ఘనత సాధిస్తాడా అన్న తేలనుంది. అసలేంటి రికార్డు?

virat kohli
virat kohli

By

Published : Jul 10, 2023, 10:36 PM IST

Updated : Jul 10, 2023, 10:47 PM IST

IND Vs WI Kohli : వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో టీమ్​ఇండియా స్టార్‌ విరాట్‌ కోహ్లీ అత్యంత అరుదైన రికార్డు ముంగిట నిలిచాడు. జూలై 12న ఆరంభం కానున్న తొలి టెస్టులో విండీస్‌ తుది జట్టు కూర్పుపై కోహ్లీ ఈ ఘనత సాధిస్తాడా లేదా అన్న విషయం ఆధారపడి ఉంది.

Sachin Test Records : టీమ్​ఇండియా దిగ్గజం సచిన్‌ పేరిట ఉన్న ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన విరాట్​.. విండీస్‌ తొలి టెస్టు సందర్భంగా మాస్టర్​ మరో అరుదైన రికార్డును సమం చేసే అవకాశం ఉంది. 1992లో ఆస్ట్రేలియా పర్యటనలో సచిన్‌.. జెఫ్‌ మార్ష్‌ భాగంగా ఉన్న జట్టుతో తలపడ్డాడు. ఆ తర్వాత 2011/12 టూర్‌లో జెఫ్‌ కుమారుడు షాన్‌ మార్ష్‌తో ఉన్న టీమ్‌తోనూ పోటీపడ్డాడు. జెఫ్‌ కెరీర్‌లో 1992 నాటి మ్యాచ్‌ చివరిది కాగా.. సచిన్‌కు ఆస్ట్రేలియా గడ్డ మీద తొలి మ్యాచ్‌. అదే విధంగా 2011 నాటి మ్యాచ్‌కు షాన్‌ మార్ష్‌కు టీమ్​ఇండియాతో మొదటిది కాగా.. సచిన్‌కు విదేశీ గడ్డ మీద చివరి టెస్టు కావడం విశేషం.

Virat Kohli Test Records : ఇప్పుడు విరాట్‌ కోహ్లీ ప్రస్తుత సిరీస్‌తో సచిన్‌ సరసన నిలిచే అవకాశం ఉంది. అదెలాగంటే... 2011 వెస్టిండీస్‌ పర్యటన సందర్భంగా... కోహ్లీ.. శివ్‌నరైన్‌ చందర్‌పాల్‌ భాగంగా ఉన్న జట్టుతో ఆడాడు. ఇక ఇప్పుడు శివ్‌నరైన్‌ తనయుడు తగ్‌నరైన్‌ చందర్‌పాల్‌ విండీస్‌ టెస్టు జట్టులో కీలక సభ్యుడిగా ఎదుగుతున్నాడు. జులై 12న మొదలుకానున్న టీమ్​ఇండియాతో తొలి టెస్టుకు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో తుది జట్టులో అతడు చోటు దక్కించుకుంటే.. విదేశీ గడ్డ మీద ప్రత్యర్థి జట్ల తండ్రీ- కొడుకులతో ఆడిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ చరిత్రకెక్కుతాడు. అంతకంటే ముందు ఈ ఘనత సాధించిన సచిన్‌ సరసన నిలుస్తాడు.

టీమ్​ఇండియా దిగ్గజం సచిన్​ తెందూల్కర్​ తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో రికార్డులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తంగా 34,357 పరుగులు చేసిన మాస్టర్‌ బ్లాస్టర్‌.. సెంచరీల విషయంలో సెంచరీ కొట్టాడు. 664 మ్యాచ్‌లు ఆడి 100 శతకాలతో ఎవరికీ సాధ్యం కాని ఫీట్‌ నమోదు చేశాడు. ప్రస్తుతం టీమ్​ఇండియా బ్యాటర్‌గా కొనసాగుతున్న కోహ్లీ ఒక్కడే (యాక్టివ్‌ ప్లేయర్‌) 75 సెంచరీలతో గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌ను అనుసరిస్తున్నాడు.

విండీస్‌తో టెస్టులకు భారత జట్టు:
Team India :రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్​మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వీ జైస్వాల్, అజింక్య రహానె (వైస్‌ కెప్టెన్‌), కేఎస్ భరత్ (వికెట్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్​ సిరాజ్, ముకేశ్​ కుమార్, జయదేవ్​ ఉనద్కత్​, నవదీప్ సైనీ.

టీమ్​ఇండియాతో తొలి టెస్టుకు వెస్టిండీస్‌ జట్టు:
West Indies Team : క్రెగ్ బ్రాత్‌వైట్‌ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్‌ (వైస్ కెప్టెన్), అలిక్ అథనాజ్, తగ్‌నరన్‌ చందర్‌పాల్‌, రకీం కార్న్‌వాల్‌, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, జేసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కిర్క్ మెకంజీ, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జోమెల్ వారికాన్.

Last Updated : Jul 10, 2023, 10:47 PM IST

ABOUT THE AUTHOR

...view details