IND VS WI: ద్వైపాక్షిక సిరీస్‌ల్లో వెస్టిండీస్‌పై వన్డే సిరీస్ వైట్‌వాష్ చేసిన భారత తొలి సారథిగా హిట్‌మ్యాన్ రికార్డు నెలకొల్పాడు. 2017లో టీమ్‌ఇండియా కోహ్లీ సారథ్యంలో చివరిసారి శ్రీలంకపై వన్డే సిరీస్ వైట్‌వాష్ చేసింది. ఆ తర్వాత ఇతర జట్లపై ఇలాంటి అవకాశం రాలేదు.
వన్డే సిరీస్‌లు వైట్‌వాష్ చేసిన టీమ్‌ఇండియా కెప్టెన్ల జాబితాలో హిట్‌మ్యాన్ ఏడో సారథిగా నిలిచాడు. అంతకుముందు కపిల్ దేవ్, దిలీప్ వెంగ్‌సర్కార్, మహ్మద్ అజాహరుద్దీన్, గౌతమ్ గంభీర్, ధోనీ, కోహ్లీల సారథ్యంలో భారత జట్టు ఆ ఘనత సాధించింది.
ధోనీ, కోహ్లీ సారథ్యంలో టీమ్‌ఇండియా మాత్రమే మూడేసి సార్లు ప్రత్యర్థులను వన్డేల్లో వైట్‌వాష్ చేసింది.
కోహ్లీని అధిగమించిన రోహిత్
రోహిత్ ఇప్పటివరకు 13 వన్డేలకు సారథ్యం వహించాడు. ఇందులో 11 గెలిచాడు. సారథిగా కోహ్లీ తొలి 13 వన్డేల్లో 10 మ్యాచుల్లో విజయం సాధించాడు. క్లైవ్ లాయిడ్, ఇంజూమామ్ ఉల్ హక్, మిషబ్ ఉల్ హక్ 12 గెలిచారు.