IND VS WI: ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు ఒకే చోట కలిస్తే... అభిమానులకు పండగే కదా! అలాంటి దృశ్యానికి ఈడెన్ గార్డెన్స్ వేదికైంది. అందులో ఒకరు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కాగా, మరొకరు టీమ్‌ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్. వీరిద్దరూ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ప్రత్యక్షమయ్యారు. ఇవాళ్టి నుంచి విండీస్‌తో మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో నిన్న రాత్రి మైదానాన్ని పరిశీలించేందుకు గంగూలీ, రాహుల్ వచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. ‘‘ఈడెన్ గార్డెన్స్‌లో భారత్‌కు చెందిన ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు కలిసిన వేళ..’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. గంగూలీ-రాహుల్ కలిసి టీమ్‌ఇండియా తరఫున దాదాపు 370 మ్యాచ్‌లు ఆడారు. ఇప్పుడు భారత క్రికెట్‌కు సంబంధించిన అత్యున్నత పదవుల్లో ఉన్నారు.
IND VS WI: ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు కలిసిన వేళ! - rahul dravid
IND VS WI: వెస్టిండీస్‌తో జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌కు ముందు దిగ్గజ క్రికెటర్లు గంగూలీ, రాహుల్ ద్రవిడ్ కలిసి ముచ్చటించారు. వీరిద్దరూ కలిసి మ్యాచ్ వేదికైన ఈడెన్ గార్డెన్స్ మైదానాన్ని పరిశీలించారు. దీనికి సంబంధించిన ఫొటోను బీసీసీఐ ట్వీట్ చేసింది.
దాదా, ద్రవిడ్
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఇవాళ (బుధవారం) రాత్రి 7 గంటలకు తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా టీ20 సిరీస్‌ను గెలుచుకుని క్లీన్‌స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. వన్డే సిరీస్‌లో వైట్ వాష్‌కు గురైన విండీస్ రగిలిపోతూ ఉంటుందనడంలో సందేహం లేదు. భారత పర్యటనకు రావడానికి ముందే అగ్ర జట్టు ఇంగ్లాండ్‌పై టీ20ల్లో విండీస్ సిరీస్ విజయం సాధించింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.