Ind vs Wi 4th T20 :అమెరికా అంటే మనకే కాదండోయ్.. సెలెబ్రిటీలకూ మక్కువ ఉంటుంది. దీనికి మన క్రికెటర్లు ఏ మాత్రం భిన్నం కాదు. వారికీ యూఎస్ఏ అనగానే కొన్ని జ్ఞాపకాలు, ఇష్టమైన ప్రదేశాలు ఉంటాయి. ఆయితే వెస్టిండీస్‌తో నాలుగో టీ20 ఆడేందుకు టీమ్ఇండియా అమెరికా చేరుకుంది.
శనివారం సాయంత్రంవిండీస్ - భారత్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో మన ప్లేయర్లు ప్రాక్టీస్ సెషన్లో ఉండగా.. టీమ్ఇండియా మేనేజ్మెంట్ వారి వద్దకు వెళ్లి 'అమెరికా అనగానే మీకు గుర్తొచ్చేవి ఏంటి'? అని ఒక్కొక్కరిని అడిగింది. వారు చెప్పిన సమాధానాలను వీడియో తీసి బీసీసీఐ అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరి ఎవరు ఏమన్నారంటే..
పేస్ బౌలర్ అర్షదీప్ సింగ్‌ను ఈ ప్రశ్న అడగ్గా.."అమెరికా అనగానే మొట్టమొదటగా ఫ్లోరిడా మియామిలో షాపింగ్ చేయడం గుర్తుకు వస్తుంది" అని సమాధానం చెప్పాడు. అమెరికా పేరు వినడమే కాని ఎప్పుడూ రాలేదు. కానీ ఇప్పుడు రావడం హ్యాపీగా ఉంది. యూఎస్ఏ బాగుంది అని మరో బౌలర్ ముకేశ్ కుమార్ అన్నాడు.
ఇక యంగ్ స్టార్ యశస్వీయూఎస్ అంటే లైఫ్‌స్టైల్ అని అనగా.. "నాకు మాత్రం ప్రత్యేకంగా మియామి రోడ్లు, భవనాలు, కార్లు చూస్తే.. జీటీఏ (వైస్సిటీ గేమ్) గుర్తొస్తుంది" అని స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బదులిచ్చాడు. మరి మిలిగిన స్టార్లు ఏమన్నారో వీడియో చూసి తెలుసుకోండి.
కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2 - 1తో విండీస్ భారత్ కంటే ముందుంది. ఇక మూడో టీ20లో గెలుపు రుచి చూసిన యువ భారత్ జట్టు.. నాలుగో మ్యాచ్‌లోనూ తమ జోరును కొనసాగించాలని ఆశిస్తోంది. సిరీస్‌లో సజీవంగా ఉండాలంటే టీమ్ఇండియా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. మరోవైపు టెస్టు, వన్డే సిరీస్‌ను పోగొట్టుకున్న విండీస్.. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టీ20 సిరీస్‌ను అయినా దక్కించుకోవాలని ఆరాటపడుతోంది. కాగా శనివారం ఫ్లోరిడా సెంట్రల్ బ్రొవార్డ్ మైదానం వేదికగా నాలుగో మ్యాచ్ జరగనుంది.
India vs West Indies 4th T20 : హార్దిక్ సేనకు మరోసారి అదే పరిస్థితి.. ఇక ఆ ఇద్దరు బరిలోకి దిగాల్సిందే..
Ind Vs Wi 3rd T20 : గంభీర్ రికార్డు బ్రేక్ చేసిన తిలక్ వర్మ.. టీమ్ఇండియా తొలి బౌలర్‌గా కుల్దీప్!